అలా జరిగితేనే దీపకు ఛాన్స్ ..!

Sunday, February 12th, 2017, 07:48:34 PM IST


జయలలిత మరణం తరువాత ఆమె మేనకోడలు మీడియా లో బాగా ప్రచారం పొందింది. జయకు సరైన వారసురాలిని తానే అంటూ ప్రకటించుకుంది కూడా. అమ్మ మరణం తరువాత శశికళ శశికళ పార్టీ కార్యకలాపాలు చూసుకోవడంతో ఆమె పై ప్రత్యక్ష విమర్శలకు దిగుతూ తరచుగా వార్తల్లో నిలిచింది. ఆమెకు పెరుగుతున్న ఆదరణ చూసి రహస్యంగాకొందరు ఎమ్మెల్యేలు ఆమె తో భేటీ అయ్యారటకూడా. దీనితో దీప అమ్మ వారసురాలి రేసులో నిలిచింది. ఆమె కొత్త పార్టీ పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. శశికళ అన్నా డీఎంకే పార్టీలో జోక్యం చేసుకోవడం ఆపార్టీ కార్యకర్తలకు మొదటి నుంచి నచ్చడం లేదు. దీనితో వారంతా దీప న్యాయకత్వం వైపు ఆశగా ఎదురు చూశారు. కానీ ఇంతలో అన్నా డీఎంకే పార్టీ లో పన్నీర్ సెల్వం, శశికళ మధ్య వార్ మొదలైంది. దీనితో మీడియా ఫోకస్ ని దీప పై నుంచి తప్పింది పన్నీర్, శశికళ వైపు ఉంచింది. వీరిద్దరి గొడవల వల్ల దీప రాజకీయ రంగ ప్రవేశం ఆలస్యం కానుందని అంటున్నారు.

గత నెల 17 న దీప తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. దానికి సంబందించిన కీలక నిర్ణయాన్ని ఈ నెల 24 జయలలిత జయంతి రోజున ప్రకటిస్తాని ఆమె తెలిపిన విషయం తెలిసిందే.ఈ లోపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటానని ఆమె అన్నారు. కానీ తమిళనాడు తాజా రాజకీయ సంక్షోభం దీపతోపాటు ఆమె రాజకీల్లోకి రావాలని కాంక్షించిన వారిని కూడా ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. శశికళని అన్నా డీఎంకే పార్టీ ముఖ్యమంత్రి పదవికి ఏకగ్రివంగా ఎన్నుకోవడంతో పన్నీర్ సెల్వం నిరాశలో ఉన్నారని ఆయన అన్నా డీఎంకే పార్టీ ని వీడే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. దీప, పన్నీర్ సెల్వం లు కలసి కొత్త పార్టీ పెట్ట బోతున్నారంటూ కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ ఒక్కసారిగా పన్నీర్ సెల్వం కు ప్రజల్లో ఆదరణ పెరిగిపోయింది. గతం లో శశికళ పై ఉన్న కోపంతో దీపకు మద్దత్తు తెలిపారు. కానీ ఒక్కసారిగా పన్నీర్ శశికళకు ఎదురు తిరగడంతో ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శశికళ ముఖ్యమంత్రి అయితే పన్నీర్ సెల్వం అన్నా డీఎంకే ని వీడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అప్పుడు పన్నీర్ సెల్వం, దీప కలసి పార్టీ పెట్టె అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీపకు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే శశికళ ముఖ్యమంత్రి కావాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.