రాజయ్యతో మాట్లాడిన మహిళ కనబడటం లేదట!

Sunday, September 23rd, 2018, 01:43:08 PM IST

ఒక మహిళతో రాసలీలల సంభాషణలు జరిపారంటూ ఆరోపణులు ఎదుర్కుంటున్న స్టేషన్ ఘనపుర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫై విమర్శలు ఎక్కువుతున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ ఆడియో టేప్ పెద్ద దుమారాన్నే రేపింది. ఈఆడియో టేప్ లో వినిపించిన వాయిస్ వరంగల్ జిల్లాకు చెందిన మహిళ దేనని నిర్ధారించారు. మహిళా కోసం విలేకరులు ఆమె ఇంటికి వెళ్లగా ఆమె ఎక్కడికెళ్లిందో తెలియదని ఆ మహిళ తల్లి దండ్రులు సమాధానం ఇచ్చారట. స్టేషన్ ఘన్పూర్ టికెట్ కోసం జరుగుతున్న పోరులో మహిళ కీలక సాక్ష్యం కావడంతో ఆమె సడన్ గా మాయమవడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఆమెను రాజయ్య వర్గమే బయటికి రాకుండా ఎక్కడో దాచి పెట్టారని ఓ వర్గం ఆరోపిస్తుంది. ఇక రాజయ్యకు స్టేషన్ ఘనపూర్ నుండి మళ్ళీ ఎమ్యెల్యే గా టికెట్ ఇచ్చారు. అయితే ఆయనకు టికెట్ రావడంపై కడియం శ్రీహరి వర్గీయులు తీవ్ర అసంతృప్తిగా వున్నారు. దాంట్లో భాగంగానే ఈ ఆడియో టేపును లీక్ చేశారని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయం ఫై పార్టీ అదినాయకత్వం ఎలా స్పందిస్తో చూడాలి.