తేదేపా-వైకాపాల‌కు ఏకైక ప్ర‌త్యామ్నాయం?

Sunday, September 9th, 2018, 03:58:38 AM IST

ఏపీలో అధికార పార్టీ తేదేపా, ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా .. ఈ రెండు పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయ‌ విరుగుడు క‌నిపెట్టే ప్ర‌య‌త్నం సాగుతోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. ఆ రెండు పార్టీల్లో ఏది గెలిచినా సామాన్యుడిని ప‌ట్టించుకుంటార‌న్న గ్యారెంటీ అయితే క‌నిపించ‌డం లేదు. ఇరు పార్టీల అగ్ర‌నేత‌లు స్వార్థ రాజ‌కీయాల‌తో, కుల రాజ‌కీయాల‌తో రాష్ట్రాన్ని పాలించే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనివ‌ల్ల అస‌లైన పేద‌లు, బ‌డుగు, బ‌ల‌హీన ప్ర‌జ‌లకు తీవ్ర‌మైన అన్యాయం జ‌రుగుతోంద‌న్న‌ది వాస్త‌వం.

ఓవైపు నిత్యావ‌స‌రాల నుంచి, ప్ర‌తిదీ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. పెట్రోల్, నూనెల ధ‌ర‌లు మంట‌లు పెట్టేస్తున్నాయి. అయితే దీనివ‌ల్ల కామ‌న్ జ‌నాల‌పైనే అధిక భారం ప‌డుతోంది. రాష్ట్రాల్ని దోచుకు తినే పాల‌కుల వ‌ల్ల ఇన్నేళ్ల‌లో సామాన్యుల‌కు ఒరిగిందేమీ క‌నిపించ‌డం లేదు. పైగా ఒక్కో త‌ల‌పై ల‌క్ష‌ల్లో అప్పులు చేసి పాల‌కులు చోద్యం చూస్తున్నారు. అందుకే తాజాగా నూతన రాజకీయ ప్రత్యామ్నయ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. “పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి, అన్ని వర్గాలపై ఆ ప్రభావం పడుతోంది, పెరిగిన ధరలను వ్యతిరేకంగా ఈ నెల 10న భారత్ బంద్ చేస్తామ‌“ని ప్ర‌క‌టించారు. 2014 కేంద్రానికి పెట్రో ఉత్పత్తుల ద్వారా 94 వేల రాబడి ఉండగా 2018 మార్చి నాటికి 3లక్షల కోట్లకు పెరిగింది. కానీ దానిని సామాన్యుల క‌ష్టం త‌గ్గించేందుకు ప్ర‌భుత్వాలు ఉప‌యోగించ‌వు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో పెట్రోల్ డీజిల్ మనకంటే ధరలు తక్కువ, కానీ ఇక్క‌డ‌ చంద్రబాబు, మోదీ పాలనలో ధరలు పెరిగాయి. అధికార, ప్రతిపక్షాలు ప్రజా జీవన విధానాన్ని దెబ్బతీసాయి. ఈ ఇరు పార్టీలు కేంద్రంలోని బిజేపి కి మద్దత్తు ప్రకటించాయి. అందుకే సిపిఎం, సిపిఐ, జనసేనతో రాజకీయాల్లో నూతన ప్రత్యామ్నయం వ‌స్తుంది అని క‌రాఖండిగా ప్ర‌క‌టించారు.

జిల్లాలో ఏకంగా హోం మంత్రే ఇసుకను మింగేస్తున్నారు. తేదేపా పాలనలో అన్ని స్కాములే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వని బిజేపికి తొలుత‌ టిడిపి సపోర్ట్ చేస్తే ఇప్పుడు వైసిపి దన్నుగా నిలుస్తోంది.. అంటూ ఆ రెండు పార్టీల గుట్టును బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఇటువంటి పార్టీలను తరిమికొట్టాల‌ని పిలుపునిచ్చారు. ఎస్ఈజెడ్‌ల పేరుతో రైతుల‌కు పంగ‌నామం పెట్టార‌ని ఆరోపించారు. సెప్టెంబర్ 15న విజయవాడలో భారీ బహిరంగ సభలో అన్నిటినీ చ‌ర్చిస్తామ‌ని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments