ఆ నియోజకవర్గంలో గెలిచిన పార్టీదే ఏపీలో అధికారమట!

Monday, July 23rd, 2018, 04:01:25 PM IST

సెంటిమెంట్లను నమ్మడం అనేది వ్యక్తుల వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి ఉంటుంది. కొందరు ప్రముఖులు, రాజకీయ నాయకులూ, సినిమా వారు, అయితే వీటిని ఒకింత ఎక్కువగానే నమ్ముతుంటారు అని చెప్పాలి. ఇక విషయంలోకి వెళితే, రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక సరికొత్త సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. విశాఖలోని దక్షిణ నియోజకవర్గం, ఒకప్పుడు దీనిని ఒకటో నియోజకవర్గం అనేవారు. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే గెలుస్తారో, రాష్ట్రంలో ఇప్పటివరకు ఆ పార్టీనే విజయం సాధించిందట. ఇది ఒకరకంగా కాకతాళీయమే అయినప్పటికి, ఇటువంటి వాటిని కొంతవరకు మమ్మీ తీరాల్సిందే అని, గతంలో ఎన్నికల సమయంలో జరిగిన గెలిచిన అభ్యర్థుల లిస్ట్ పరిశీలించమంటున్నాయి రాజకీయ వర్గాలు.

ఈ నియోజకవర్గంలో 1983 లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన కొత్తలో ఆ పార్టీ తరపున గ్రంధి మాధవి విజయకేతనం ఎగురవేయగా, 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ టీడీపీకి చెందిన అల్లు భానుమతి కూడా గెలుపొందారు. ఆ సమయంలో టిడిపి అధికారంలో వుంది. ఎన్టీఆర్ ఆ రెండుసార్లు ముఖ్యమంత్రిగా వున్నారు. ఇక 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ కు చెందిన ఈటి విజయలక్ష్మి విజయం సాధించగా, అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తరువాత 1994 అసెంబ్లీ ఎన్నికల్లో రెహమాన్ టిడిపి తరపున గెలువగా, అప్పుడు టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది. పోతే 1999ఎన్నికల సమయంలో బీజేపీతో జతకట్టింది టీడీపీ. ఆ సమయంలో అక్కడ బీజేపీ తరపున పోటీ చేసిన కంభంపాటి హరిబాబు గెలుపొందారు.

ఇక రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇకపోతే 2004లో కాంగ్రెస్ తరపున నిలబడ్డ ద్రోణం రాజు సత్యనారాయణ కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు, రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. అయితే అయన 2005లో అనారోగ్యంతో మృతి చెందడంతో, 2006లో వచ్చిన ఉప ఎన్నికలోనూ, అలానే 2009లో వచ్చిన సాధారణ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. గత ఎన్నికలు అనగా 2014లో టిడిపి నుండి వాసుపల్లి గణేష్ కుమార్ ఇక్కడి నుండి పోటీ చేసి గెలుపొందగా, టీడీపీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. అయితే ఇప్పటివరకు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే, ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో కూడా ఇదేవిధంగా జరుగుతుందో, లేదా మారుతుందో తెలియాలంటే 2019 ఎన్నికలవరకు వేచిచూడవలసిందే…..

  •  
  •  
  •  
  •  

Comments