గ‌ద్ద‌ర్ ఎందుకు ప్లేటు ఫిరాయించారు?

Friday, November 9th, 2018, 01:22:26 PM IST

గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఉద్య‌మ జీవితాన్ని గ‌డిపిన ప్ర‌జా యుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్ హ‌ఠాత్తుగా క్రీయాశీల రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించ‌డం ఎర్ర‌పార్టీల‌తో పాటు సామాన్యుడికి అంతుచిక్క‌డం లేదు. గ‌త కొంత కాలంగా తెరాస ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న గ‌ద్ద‌ర్ కాంగ్రెస్ గూటికి చేర‌తాడ‌ని అంతా ఊహించారు. ఆ ఊహ‌ల్ని నిజం చేస్తూ త‌న భార్య‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లిన గ‌ద్ద‌ర్ కాంగ్రెస్ అధినాయ‌క‌త్వాన్ని క‌ల‌వాలనుకున్నారు. చివ‌రికి రాహుల్‌ని క‌లిసి త‌న మ‌ద్ద‌తు త‌మ‌కే వుంటుంద‌ని ఫొటోల‌కు పోజులివ్వ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు దారితీసింది.

అయితే ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన త‌రువాత రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల‌కు, త‌న‌కు పొస‌గ‌క‌పోవ‌డంతో త‌న దారి తాను చూసుకున్నార‌నే వార్త‌లు వినిపించాయి. త‌న కుమారుడికి కాంగ్రెస్ త‌రుపున టికెట్ సాధించాల‌న్న ఎత్తుగ‌డ‌లో భాగంగానే గ‌ద్ద‌ర్ రాహుల్‌ను క‌లిశార‌ని, అయితే ఆ ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్‌తో పాటు మ‌హాకూట‌మికి మ‌ద్ద‌తుగా నిల‌వాల్సింది పోయి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా తానే పోటీకి దిగుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాను గ‌జ్వేల్ నుంచి కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా పోటీ చేస్తాన‌ని గానీ మ‌హాకూట‌మి నాయ‌కుల‌తో సంప్ర‌దించివుంటే ప‌రిస్థితి మ‌రోలా వుండేద‌ని, లేని పోని అహానికి పోయి గ‌ద్ద‌ర్ చివ‌రి నిమిషంలో ఇలా ప్లేటు ఫిరాయించాడ‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇంత‌కీ కూట‌మి అండ లేకుండా గ‌జ్వేల్‌లో గ‌ద్ద‌ర్ బ‌రిలోకి దిగ‌డం కేసీఆర్‌కు క‌లిసొస్తుందా? లేక దుందుడుకు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న కాంగ్రెస్ నేత ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డికి క‌లిసొస్తుందా? అన్న‌దానిపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ పొలిటిక‌ల్‌ గేమ్‌లో గ‌ద్ద‌ర్ పావుగా మార‌డ‌నే అభిమానులు కోరుకుంటున్నారు.