పోల్: కాంగ్రెస్‌కు సరైన ప్రధాని అభ్యర్థి ఎవరు?

Sunday, January 19th, 2014, 01:04:32 PM IST

లోక్ సభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరనేదానిపై ఆ పార్టీ ఇప్పటికీ తేల్చుకోలేకపోతోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై వెలువడుతున్న ఊహాగానాలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెరదించింది. ‘రాహుల్ కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కాదు. ఏప్రిల్-మే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచార సారథ్య బాధ్యతలు వహిస్తారు’ అని సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం పార్టీ ప్రకటించింది. ముందుగానే ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం పార్టీ సంప్రదాయం కాదని స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు సరైన ప్రధాని అభ్యర్థి ఎవరని మీరు భావిస్తున్నారు?


పోల్: కాంగ్రెస్‌కు సరైన ప్రధాని అభ్యర్థి ఎవరు?