హ‌త‌విధీ.. ఎమ్మెల్యే టేప్ ఈయ‌న ప‌నే!!

Wednesday, September 12th, 2018, 09:00:13 AM IST

తేరాస‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట ఎమ్మెల్యే రాజ‌య్య కొంప ముంచిందా? ప‌క్క‌నే ఉంటూ డొక్క‌లో పొడిచారా? అంటే అవున‌నే స‌హ‌చ‌రుల్లో చ‌ర్చ సాగుతోంది. స‌రైన టైమ్ చూసి ఆయుధంలా ఉప‌యోగించుకునేందుకే స‌ద‌రు ఎమ్మెల్యే గారి రాస‌లీల ఆడియో టేపుల్ని కొలీగ్స్ ముంద‌స్తుగా రికార్డు చేయించి ఉంచార‌ట‌. అందుకోసం ఏకంగా ఓ డీగ్యాంగ్ వ‌గ‌ల‌మారిని బ‌రిలో దించార‌న్న మాటా వినిపిస్తోంది.

తేరాస‌లో అంతర్గత కుమ్ములాటలకు పరాకాష్ట ఇద‌ని చెబుతున్నారు. రాజ‌య్య ఆడియో టేప్ లీక్ వెన‌క ఉన్న‌ది సాక్షాత్తూ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి ప‌నే ఇద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయ‌నే ఇంత ప‌నీ చేశారా? అంటే… అందుకు స‌హేతుక కార‌ణం చూపెడుతున్నారు. తన కూతురు కావ్య టికెట్ కోసం డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ ఆడియోను బహిర్గతం చేశార‌ని పార్టీ వ‌ర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే రాజ‌య్య స‌ద‌రు మ‌హిళ‌తో స‌ర‌స‌స‌ల్లాపాలు సాగించిన ఆ ఆడియో టేప్‌లో ఉన్న మ‌హిళ ఎవ‌రు? అని ఆరాలు తీస్తున్నారు. స‌ద‌రు మహిళ వీడియో సైతం నేడు బహిర్గతం అయ్యే అవకాశం ఉంద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. తాజా లీకేజీతో జనగామ జిల్లా- స్టేషన్ ఘనపూర్ లో రాజకీయ సమీకరణలు ఆస‌క్తిగా మార‌నున్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. హ‌ర‌హ‌రా!!

  •  
  •  
  •  
  •  

Comments