సచిన్ కొడుకుతో ఉన్న ఆ మహిళా క్రికెటర్ ఎవరంటే?

Wednesday, August 8th, 2018, 03:49:22 PM IST

ఈ మధ్య సెలెబ్రిటీలు, మరియు క్రికెటర్లు ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కొంతవరకు తెలుస్తోంది. ఇక మరికొందరైతే తాము ఏ ఫీల్డ్ లో అయితే ఉన్నామో, అందులోని వారినే పెళ్లి చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. మనం చెప్పుకున్నట్లు ఇటువంటి పెళ్లిళ్లు అక్కడక్కడా కనపడుతూనే వున్నాయి. ఇకపోతే అసలు విషయం ఏమిటంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ అండర్ 19 తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే అతడు టీం తరపున ఆడిన తొలి మ్యాచ్ లోనే అందరిని నిరాశపరిచాడు.

అయితే సచిన్ కూడా తన తొలి క్రికెట్ సెంచరీ చేయడానికి చాలానే సమయం పట్టింది అనుకోండి. ఇక శ్రీలంకతో జరిగిన అండర్ 19 యూత్ టెస్ట్ సిరీస్ ముగించుకుని ప్రస్తుతం ఇంగ్లాండ్ చేరుకున్నాడు అర్జున్ టెండూల్కర్. ప్రస్తుతం ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టులోని క్రికెటర్ డానియెల్ వ్యాట్ తోటి అర్జున్ లంచ్ చేస్తున్న ఒకఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా ఈ వ్యాట్ మరెవరోకాదు, అప్పట్లో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది ఈమే. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న అర్జున్ మరియు వ్యాట్ ఫోటోపై నెటిజన్లు వీళ్లిద్దరు ఫ్రెండ్సా, లేక లవర్సా లేక అంతకుమించి ఇంకేమైనా ఉందా అంటూ పలువిధాలుగా కామెంట్స్ చేస్తున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments