ఏపీ బిజెపి అధ్యక్షుడెవరు?

Tuesday, April 24th, 2018, 10:08:36 AM IST

ఏపీ బిజెపి అధ్యక్ష పదవికి ఇప్పటికే కంభంపాటి హరిబాబు తన అధ్యక్ష పదవికి కొద్దిరోజుల క్రితం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ పదవికి ఎవరిని తీసుకంటారు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వలేదని బిజెపి అధిష్టానంపై తీవ్ర విమర్శలు వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఆ పదవి చేపట్టే వ్యక్తి ఇటువంటి వాటికీ ధీటుగా సమాధానం చెప్పేలా ఉండాలి అని నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అఖిల భారత స్థాయి అధికార పదవినుండి వైదొలిగిన వ్యక్తి అయితే ఇటువంటి పదవికి అర్హుడని,

అప్పుడే ఏపీ లో పార్టీని గట్టిగా ముందుకు తీసుకులేళ్ళగలదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి నేతల్లో ముఖ్యంగా కన్నా లక్ష్మి నారాయణ పేరు వినిపించినప్పటికీ, త్వరలో ఆయన పార్టీ మారె అవకాశం కనపడుతోందని, కావున ఆయనకు ఈ పదవి దక్కే అవకాశం లేదని తెలుస్తోది. అలానే కొద్దిరోజులనుండి సోము వీర్రాజు పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ, కొన్ని సమస్యల కారణంగా ఎందుకో అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపానట్లుగా తెలుస్తోంది.

అలానే ఆకుల సత్యనారాయణ, మాణిక్యాల రావు ల పేర్లు కూడా ప్రస్తావనలో వున్నాయట. అందులో సత్యనారాయణ కొత్తవారు కావడంతో, ఇక మిగిలిన మాణిక్యాలరావు కు ఎక్కువ శాతం ఈ పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. కాగా రానున్న రోజుల్లో ఎవరిని ఈ పదవి వరిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments