భరత్, చిట్టిబాబులలో ఎవరు అసలు విజేత?

Sunday, July 29th, 2018, 10:50:13 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల లేటెస్ట్ మూవీస్ భరత్ అనే నేను, రంగస్థలం చిత్రాలు రెండూ 20 రోజుల తేడాతో విడుదలయ్యాయి. అయితే ఈ రెండు పెద్ద చిత్రాలు కూడా తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ఇండస్ట్రీ కి ఈ సంవత్సరం మంచి ఊపు నిచ్చాయి అనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం కొద్దికాలం నుండి అటు సూపర్ స్టార్, ఇటు మెగా పవర్ స్టార్ అభిమానులు ఇద్దరు మాదంటే మాది పెద్ద విజయం అంటూ సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలెట్టారు. ఇక అసలు లెక్కల ప్రకారం మాట్లాడితే రెండు చిత్రాల్లో రంగస్థలం మొత్తంగా క్లోసింగ్ కి రూ.214 కోట్లు గ్రాస్ వసూలు చేయగా మహేష్ భరత్ అనే నేను రూ. 205 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు చెపుతున్నారు. అయితే దీనికి ఒక కారణం లేకపోలేదట. అది ఏంటంటే, రంగస్థలం మాస్ చిత్రం కావడం ఒకరకంగా గెలుపుకు కారణమని,

ఇక భరత్ అనే నేను మెసేజ్ తో కూడిన క్లాస్ చిత్రం కావడమేనని అంటున్నారు. అయినప్పటికీ రెండూకూడా ప్రేక్షకులకు బాగా చేరువవ్వడం ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. దీని ప్రకారం రెండు చిత్రాలు రూ.9 కోట్ల తేడాతో అద్భుతం విజయం అందుకోగా. ఇక మరొక ముఖ్య అంశంలో మాత్రం చిట్టిబాబే భరత్ కంటే చాలా ముందు ఉన్నాడని చెప్పుకోవాలి. రంగస్థలం వందరోజులు 15 కేంద్రాల్లో జరుపుకుంటే, నిన్నటితో వంద రోజులు పూర్తి చేసుకున్న భరత్ అనే నేను 6 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. అయితే ఒకరకంగా దీని ప్రకారం చూస్తే భరత్ పై చిట్టిబాబుదే కొంత మేరకు పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో కలెక్షన్లు రెండు చిత్రాలకు దాదాపు సమానంగా వస్తే ఒక్క నైజాం లో మాత్రం భరత్ కంటే చిట్టిబాబుదే పై చేయిగా కనపడుతోంది….

  •  
  •  
  •  
  •  

Comments