సన్ రైజర్స్ vs రాజస్థాన్ రాయల్స్ ఎవరు గెలవొచ్చు ?

Monday, April 9th, 2018, 08:01:32 AM IST

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో భాగంగా రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ రాత్రి 8 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరగనుంది. ఇరు జట్లకు మొదటి మ్యాచ్ కావడంతో రెండు జట్లు తొలి మ్యాచ్ లో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని ఆశతో ఎదురుచూస్తున్నాయి. అయితే రెండు జట్ల బలాబలాలు ఎలావున్నాయో చూద్దాం.

సన్ రైజర్స్ హైదరాబాద్ :
ఇందులో ప్రధానంగా వార్నర్ లేకపోవడం పెద్ద వెలితిగానే చెప్పుకోవాలి. అయితే బాటింగ్ విభాగం లో శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, యూసఫ్ పఠాన్ , మనీష్ పాండే లు ఉండనే వున్నారు. అలానే విధ్వంశకర బ్యాట్స్ మాన్ బ్రాత్ వైట్ కనుక చెలరేగి ఆడితే ఇక పరుగుల వరద పారవలసిందే. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, వ్రిద్దిమాన్ సాహా, రషీద్ ఖాన్, బేసిల్ తమ్పి వంటి బౌలర్లు వున్నారు. భువనేశ్వర్ ఒక వేళ రాణిస్తే ఈ జట్టుకి ఇంక ఎదురు ఉండదు అనే చెప్పాలి.

ముఖ్యమైన ఆటగాళ్లు : శిఖర్ ధావన్ – కేన్ విలియమ్సన్ – భువనేశ్వర్ కుమార్

రాజస్థాన్ రాయల్స్ :

ఈ జట్టులో ప్రధానంగా స్టీవ్ స్మిత్ నిషేదించబడడంతో కొంతమేర లోటు గానే చెప్పుకోవాలి. బాటింగ్ లో ముఖ్యంగా ఆర్సీ షార్ట్, జొస్ బట్లర్, సంజు శాంసన్, అజంక్యా రహానే, మిదున్, రాహుల్ త్రిపాఠి వంటి వారున్నారు. రహానే, కానీ బట్లర్ కానీ మంచి ఆట తీరు కనపరిస్తే పరుగులు బాగా వచ్చే అవకాశం వుంది. ఇక బౌలింగ్ విభాగంలో బెన్ స్టొక్స్, జయదేవ్ ఉనాద్కట్, అంకిత్ శర్మ, బెన్ లలిన్, వున్నారు. స్టొక్స్ వీరికి బౌలింగ్ లో ప్రధాన బలం. అతనికి తోడు బెన్ లాలిన్ లాంటి వారు రాణిస్తే ప్రత్యర్థుల పరుగులకు అడ్డుకట్ట వేయవచ్చు.

ముఖ్యమైన ఆటగాళ్లు : అజంక్యా రహానే – జొస్ బట్లర్ – బెన్ స్టొక్స్

  •  
  •  
  •  
  •  

Comments