బిగ్ బ్రేకింగ్ : ఏపీ మ‌హిళ‌ల ఓట్లు ఎవ‌రికి..? ది హిందూ ఎడిటర్ అద్భుత విశ్లేష‌ణ‌..!

Monday, April 22nd, 2019, 07:16:59 PM IST

ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు పూర్తైన నేప‌థ్యంలో ఫ‌లితాల‌పై తీవ్ర‌మైన ఉత్కంఠ‌త కొన‌సాగుతోంది. ప్ర‌జ‌ల తీర్పు ఎలా ఉండ‌బోతుంద‌న్న అంశంపై సస్పెన్స్ తీవ్ర స్థాయిలో కొన‌సాగుతోంది. ఆ ప్ర‌శ్న‌కు సంబంధించి స‌మాధానం తెలియాలంటే మే 23వ తేదీ వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్, ఫ‌లితాల ప్ర‌క‌ట‌న మ‌ధ్య చాలా గ్యాప్ ఉన్నందున వెలువ‌డ‌నున్న ఫ‌లితాలు ఇలా ఉండ‌బోతున్నాయంటూ ప‌లు స‌ర్వేలు ఇప్ప‌టికే వివ‌రాల‌ను వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అందులో ఎక్కుశాతం స‌ర్వేలు వైసీపీకి మ‌ద్దతుగా ఫ‌లితాల‌ను వెల్ల‌డించాయి. ఈ నేపథ్యంలో ఏపీలో రాబోయేది కూడా వైసీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని ఆ పార్టీ వ‌ర్గాలు ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి.

అయ‌తే, వైసీపీ శ్రేణుల వాద‌న‌ను టీడీపీ వ‌ర్గాలు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాయి. ఎన్నిక‌ల చంద్ర‌బాబు నాయుడు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ప‌సుపు – కుంకుమ ప‌థ‌కం టీడీపీ గెలుపుకు నాంది ప‌లుకుతుంద‌ని, ఆ ప‌థ‌కం ల‌బ్దిదారులు (మ‌హిళ‌లు) ఎక్కువ‌శాతం మంది టీడీపీకే ఓటు వేశార‌ని, ఆ క్ర‌మంలోనే ఏప్రిల్ 11న అర్ధ‌రాత్రి వ‌ర‌కు పోలింగ్ జ‌రిగింద‌న్న‌ది టీడీపీ వ‌ర్గాల వాద‌న‌.

మ‌హిళ‌లు అర్ధ‌రాత్రి వ‌ర‌కు పోలింగ్ కేంద్రం వ‌ద్ద క్యూలో నిల‌బ‌డి ఉండ‌టాన్ని టీడీపీకి అనుకూల అంశంగా ఆ పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే చంద్ర‌బాబు నాయుడు సైతం ఎన్నిక‌ల‌కు ముందు టీవీ ప్ర‌క‌ట‌న‌ల‌తో మ‌హిళ‌లు క‌చ్చితంగా వారి వారి ఓటును ఉప‌యోగించుకోవాల‌ని ప‌దే ప‌దే విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన పిలుపుతోనే మ‌హిళ‌లు ఆల‌స్య‌మైనా స‌రే, తిండి, త‌ప్పిక‌ల‌ను కూడా కాద‌ని టీడీపీకే ఓటేశార‌ని ఆ పార్టీవ‌ర్గంవారు పూర్తి స్థాయిలో న‌మ్ముతున్నారు.

అయితే, ఏపీ మ‌హిళ‌ల ఓట్ల‌న్నీ టీడీపీకే ప‌డ్డాయ‌ని వాదిస్తున్న ఆ పార్టీ వ‌ర్గం స్టేట్‌మెంట్‌ల‌ను ది హిందూ ఎడిట‌ర్ నాగేశ్ కుమార్ ఖండించారు. ఆ మేర‌కు త‌న పూర్తిస్థాయి విశ్లేష‌ణను ఓ ప్ర‌ముఖ ఛానెల్ ద్వారా చెప్పుకొచ్చారు.

చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడూ చెబుతున్న‌ట్టు గ‌త ఐదేళ్ల టీడీపీ పాల‌న‌తో ఏపీ మ‌హిళ‌లు పూర్తిస్థాయిలో సంతృప్తి చెంద‌లేద‌ని, దానికి ప్ర‌ధాన కార‌ణం డ్వాక్రా సంఘాల ద్వారా టీడీపీ ప్ర‌భుత్వం వ‌సూలు చేసిన వ‌డ్డీనేన‌ని నాగేశ్ కుమార్ తెలిపారు.

ఏపీలోని ప్ర‌తి డ్వాక్రా గ్రూపు రూ.ల‌క్ష నుంచి రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలను పొందాయ‌ని, ఆ రుణాల‌ను తిరిగి క‌ట్ట‌లేని స్థితిలోని కొంత మంది పేద మ‌హిళ‌ల నుంచి టీడీపీ ప్ర‌భుత్వం వ‌డ్డీని వ‌సూలు చేసింద‌ని, త‌క్కువ‌లో త‌క్కువ‌గా వ‌డ్డీ వేసుకున్న ఒక్కో డ్వాక్రా గ్రూపు నుంచి రూ.60 వేల వ‌ర‌కు వ‌డ్డీ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌ని చెప్పిన వైఎస్ జ‌గ‌న్ మాట‌ను ఆయ‌న గుర్తు చేశారు. డ్వాక్రా గ్రూపుల‌కు సంబంధించి జ‌గ‌న్ చెప్పిన వాద‌న‌ను ది హిందూ ఎడిట‌ర్ నాగేశ్ కుమార్ స‌మ‌ర్దించారు. అది వంద‌కు వంద శాతం వాస్త‌వ‌మ‌న్నారు.

ఇలా డ్వాక్రా గ్రూపుల నుంచి వ‌డ్డీ రూపాన వ‌సూలు చేసిన న‌గ‌దునే తిరిగి వారికి ప‌సుపు – కుంకుమ ద్వారా చంద్ర‌బాబు పంపిణీ చేశాడ‌ని మ‌హిళ‌ల‌కు పూర్తి స్థాయిలో అర్ధ‌మైన విష‌యాన్ని నాగేశ్ కుమార్ ఇంట‌ర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు. ఈ లెక్క‌న ప‌సుపు – కుంకుమ ప‌థ‌కం టీడీపీపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపింద‌ని ది హిందూ ఎడిట‌ర్ నాగేశ్ కుమార్ పూర్తి స్థాయి విశ్లేష‌ణ‌ను వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌లో చెప్పారు.

ఇదే క్ర‌మంలో డ్వాక్రా సంఘాల‌పై జ‌గ‌న్‌కు ముంద‌స్తు ఆలోచ‌న అద్భుత‌మ‌ని నాగేశ్ కుమార్ పేర్కొన్నారు. మ‌రి ఈ లెక్క‌న ఏపీ మ‌హిళ‌ల ఓట్లు టీడీపీకి ప‌డే అవ‌కాశ‌మే లేద‌న్న న‌గేశ్ కుమార్ విశ్లేష‌ణ వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప‌క‌నే చెబుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వారి వారి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.