కృష్ణుడు వేషంలో ఫస్ట్ ప్రైజ్.. అదే అమ్మాయికి శాపమైంది..!

Thursday, January 4th, 2018, 08:04:49 PM IST

ఉత్తరప్రదేశ్ లో బిజెపి అధికారంలోకి వచ్చాక కాస్త మతం తాలూకు ఛాయలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. బిజిపికి స్వతహాగా ఉండే బ్రాండ్ అదే అయినప్పటికీ తాజాగా జరిగిన ఓ ఘటన పొలిటికల్ రచ్చగా మారుతోంది. మీరట్ కు చెందిన 15 ఏళ్ల అలియా ఖాన్ అనే ముస్లిం యువతి అందరిని ఆశ్చర్యపరిచింది. శ్రీ కృష్ణుడి వేషం కట్టి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. కేవలం వేషం మాత్రమే కాదు.. భగవత్ గీత లోని శ్లోకాలని మిగిలిన వారికంటే బాగా పఠించి ముఖ్యమంత్రి మంత్రి యోగి ఆదిత్యనాథ్ ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. యోగి ఆ యువత టాలెంట్ కి ముచ్చట పడ్డారు.

శ్రీకృష్ణుడి వేషం కట్టడం, భగవత్ గీత శ్లోకాలు పఠించడం ఆ యువతికి శాపంగా మారింది. ముస్లిం పెద్దలు ఆ అమ్మాయిపై ఫత్వా జారీ చేశారు. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓక ముస్లిం అయి ఉండి భగవత్ గీత ఎలా చదువుతావు అని ప్రశ్నిస్తున్నారు. తాను భగవత్ గీత చదివినంత మాత్రాన ఇస్లాం బలహీన పడిపోతుందా అనేది అలియా ఖాన్ సమాధానం. నాపై పత్వా జారీ చేశారు. ఇది చాలా దారుణం. దయచేసి దీనిని రాజకీయం చేయవద్దంటూ వేడుకుంది.