32వేలు ఫోన్ 1లక్ష 9వేలకు అమ్ముతున్న ఆపిల్..ఎందుకు?

Thursday, September 27th, 2018, 05:30:24 PM IST

ప్రపంచం మొత్తం మీద మొబైల్ ఫోన్ రంగంలో రారాజు అంటే అప్పుడు ఠక్కున గుర్తొచ్చేది నోకియా.కానీ ఇప్పుడు మాత్రం ఎన్నో బ్రాండ్లు వచ్చేసాయి కానీ ఇప్పుడు అగ్రస్థానం ఎవరిదీ అంటే మాత్రం స్టీవ్ జాబ్స్ కి చెందిన ఆపిల్ ఐఫోన్ అనే చెప్తారు.ఆ ఫోన్ల పట్ల జనానికి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.వారి నుంచి ఒక కొత్త ఫోన్ విడుదల అవుతుంది అంటే కొన్ని రోజుల ముందే ఆపిల్ స్టోర్ బయట జనం క్యూ కడతారు.

అలాంటిది ఇప్పుడు ఐఫోన్ మళ్ళీ కొన్ని కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నాం అంటూ మూడు ఫోన్లను విడుదల చేసింది,వాటి యొక్క ధరను చూస్తే సామాన్యుడు బెంబేలెత్తిపోతాడు.ఆపిల్ 10ఎస్ మాక్స్ లో మొదటి వేరియంట్ ధరనే దాదాపు లక్షా పది వేల దగ్గరలో పెట్టింది కానీ నిజానికి ఆ ఫోన్ కి అంత పెట్టుబడి అస్సలు అవ్వదని టెక్నాలజీ రంగంలోని విశ్లేషకులు అంటున్నారు.ఆ ఫోన్ కి మొత్తానికి చూసుకున్నా సరే 32 వేలు మాత్రమే అవుతుందని,కానీ వారు పెట్టిన ధర చూసుకుంటే 1 లక్షా పదివేల దగ్గరకు ఉందని అంటే దాదాపు 80వేల రూపాయలు ఆపిల్ కంపెనీకి లాభమని తెలుపుతున్నారు.దీన్ని బట్టి అర్ధం కావట్లేదా ఆపిల్ కంపెనీ ఇన్నాళ్లు ఎందుకు అగ్రగామిగా ఉందొ.