ఆడపిల్ల పుడితే ఎందుకింత వివక్షత చూపిస్తున్నారు..?

Tuesday, October 2nd, 2018, 05:51:11 PM IST

తాను ఈ భూమ్మీద సంచరించడానికి కారణమైన ఒక తల్లికి పుట్టిన మగవాడు అదే స్త్రీ తనకి పుడుతుంది అని తెలిస్తే వద్దనుకుంటున్నాడు.ఆడ బిడ్డ పుట్టడానికి ప్రధాన కారణమైన మగవాడు తనకి పుట్టబోయే బిడ్డ పాప అని తెలిస్తే పురిట్లోనే చంపేసుకుంటున్నాడు.ఇలాంటి రెండు చేదు సంఘటనలే ఈ రోజు విజయవాడలోని ఎదురయ్యాయి ఇద్దరు వేరు వేరు ఆడవారు తాము ఒక ఆడ బిడ్డకి జన్మనిస్తున్నారని తెలిసి వారి భర్తలు వారి బాగోగులు చూడకపోవడమే సరికదా కనీసం వారిని దరిదాపుల్లోకి రానివ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు.

వీరి ఇద్దరిలో ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కూడా ఉన్నారు.వారికి కూడా ఆడ బిడ్డ పుడుతుందని తెలిసి ఆమె భర్త తాను మూడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలోనే మూఢ నమ్మకాలకు పోయి ఆమెతో అన్ని సంబంధ బాంధవ్యాలు తెంచేసుకున్నాడు.తాను తనతో కలిసి బతకాలి అంటే ఆమెను ఆ గర్భాన్ని తీయించుకోవాలని ఆంక్షలు పెట్టాడు దీనితో ఆమె ససేమిరా అనడంతో ఇక ఆమెను వదిలేసి ఎక్కడున్నాడో కూడా దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్నాడు,ఆ తల్లి తన బిడ్డని తీసుకొని తన అత్తవారి ఇంటికి వెళ్లగా వారు కూడా ఆడ బిడ్డకు జన్మనిచ్చినందుకు తనని ఇంట్లోకి కూడ రానివ్వడం లేదని ఆ తల్లి వాపోయింది.

దీనిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడ ఉన్నటువంటి తన భర్త బంధువు అసలు ఆ ఫిర్యాదుని తెరవనివ్వడం లేదని తన బాధను వ్యక్తం చేశారు.తనకి న్యాయం జరిగేంత వరకు తాను అక్కడే ఉంటానని వారి అత్త గారి ఇంటి దగ్గర ఆందోళన చేపట్టారు.ఆధునికంగా ఎదుగుతున్న మానవుడు మానసికంగా ఎందుకు ఎదగలేకపోతున్నాడో అర్ధం కావట్లెదు.నిజానికి సైన్స్ ప్రకారం చెప్పాలి అంటే ఆడపిల్ల పుట్టడానికి ముమ్మాటికి మగవాడే కారణం,అతనిలో ఉండేటువంటి జన్యు లక్షణాల ద్వారానే పుట్టబోయేది మగ బిడ్డా లేక ఆడ బిడ్డా అనేది ఆధారాపడి ఉంటుంది.కానీ ఆడపిల్ల పుడితే దానికి కారణం తన భార్యే అన్నట్టుగా మానవత్వం మర్చిపోయి వారిని వదిలేసి వెళ్లిపోతున్నారు.తాను పుట్టడానికి కూడా కారణం ఒక తల్లే అని,ఒకవేళ తన తల్లి యొక్క తండ్రి కూడా తన కూతుర్ని చంపుకొని ఉంటే తాను ఇప్పుడిలా భూమ్మీద ఉండేవాడు కాదు అన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడు.