టీడీపీ నేతలు అవినీతి చేసారు కాబట్టే ఇంత భయపడుతున్నారు.జీవీఎల్

Friday, October 12th, 2018, 02:45:53 PM IST

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం నేతల ను ఆదాయ పన్ను శాఖ వారు, ఎడతెరిపిలేని దాడులతో ఉక్కిరి బిక్కిరి చేసేతున్నారు.దీనితో టీడీపీ నేతలు వారిపై కక్ష సాధింపు చర్యగా కేంద్రం కావాలనే తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.అయితే ఇందులో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని,ఇది వరకు ఇతర నేతల మీద వేరే పార్టీల వారి మీద దాడులు చేసినపుడు టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గారు విమర్శిస్తున్నారు.

ఇంతకాలంగా ఒక్క మాట కూడా మాట్లాడని వారు ఇప్పుడు వారి దగ్గరకి వచ్చేసరికి ఎందుకని ఇంత బెంబేలెత్తిపోతున్నారని ప్రశ్నించారు.టీడీపీ నేతలు దాదాపు 53వేల కోట్లు అవినీతి సొమ్ము వారి బ్యాంకు ఖాతాల ద్వారా తరలించబడ్డాయన్నవి రాజకీయ ఆరోపణలు కాదు సిఐజీ రిపోర్టులో కూడా వచ్చాయని తెలిపారు.వీరు అంత నీతిగా తమ ఆస్తులను సంపాదించుకుంటే ప్రజలకి,కేంద్రానికి ఆయన ఒక ప్రజా ప్రతినిధిగా సమాధానం చెప్పాల్సిన భాద్యత ఉంది కానీ తాను కేంద్రానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చెయ్యడం వల్లనో లేక వారిని ప్రశ్నిస్తున్నానో కక్షపూరితంగా చేసినటువంటి దాడులైతే ఇవి కావని తెలిపారు.వారు నిజంగా అక్రమార్జన చెయ్యకుండా సంపాదించుకున్న ఆస్తులైతే ఎందుకు భయపడుతున్నారని జీవీఎల్ ప్రశ్నించారు.