పాండ్యను, ఎల్లీ ఎయిర్ పోర్టులో ఎందుకు వదిలి వెళ్ళింది..?

Tuesday, March 6th, 2018, 01:32:55 PM IST

గత కొద్దికాలంగా ప్రముఖ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య..బాలీవుడ్‌ నటి ఎల్లీ అవ్రామ్‌ తో డేటింగ్‌లో ఉన్నట్లు మనందరికీ తెలిసిన వార్తే. ఇదిలాగుంటే హార్దిక్‌ సోదరుడు కృనాల్‌ ఒక పెళ్లి సందడికి వెళ్లి రావడం..హార్దిక్‌ పక్కనే నిలబడి ఫొటోలు దిగడంతో కొన్ని వదంతులు కుడా మొదలయ్యాయి. ఈ అంశంపై ఇంతకుముందు ఓ సందర్భంలో ఎల్లీ స్పందించారు. కానీ హార్దిక్‌తో ప్రేమలో ఉన్నది నిజమా? కాదా?అన్న విషయం మాత్రం ఎవ్వరికీ క్లారిటీ ఇవ్వలేదు. ‘ఈ అంశంపై నేను ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అయినా ఎవరేమనుకుంటే నాకేంటి?’ అని ఘాటుగా వెల్లడించారు.

అయితే తాజాగా.. హార్దిక్‌ను ఎయిర్‌పోర్ట్‌ వద్ద వదిలి వెళ్లేందుకు ఎల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఎల్లీ, హార్దిక్‌ కారులో పక్కపక్కనే కూర్చుని ఎయిర్‌పోర్ట్ దగ్గరకు రావడం మీడియాకనిపెట్టింది. దాంతో ఎల్లీ ఎవ్వరికీ కన్పించకుండా ముఖాన్ని తన హెయిర్తో కప్పుకుంటు దాచేసుకుంది. హార్దిక్‌ మాత్రం మీడియా ఆపి అడిగిన కుడా స్పందించకుండా లగేజ్‌తో ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లిపోయారు.

ఇదిలాగుంటే మరోపక్క మంగళవారం నుంచి భారత్‌-బంగ్లాదేశ్‌- శ్రీలంక మధ్య టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం విరాట్‌ కోహ్లీ, భువనేశ్వర్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్య, కులదీప్‌ యాదవ్‌కు కాస్త విశ్రాంతి ఇచ్చారు. ఇక జరగబోయే టోర్నీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.