ఢిల్లీ లొల్లి పై కేసీఆర్ ఎందుకు మౌనం వహించారు?

Sunday, June 17th, 2018, 09:18:58 PM IST

ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీ వాల్ ఐఏఎస్ అధికారుల సమ్మెను విరమింప చేయాలనే ఆలోచనతో లెఫ్టినంట్ గవర్నర్ చేస్తున్న కార్యక్రమాలకు, తీరుకు వ్యతిరేకంగా కొద్దిరోజులుగా తన సహచర మంత్రులతో సహా తలపెట్టిన నిరసన దీక్షలో ఆయనకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఓవైపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో కలిసి నీతి ఆయోగ్ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాల విషయమై గత శనివారమే కేసీఆర్ ప్రధాని మోడీని కలిసి చర్చించారు. కానీ ఇప్పటికే ఈ సమావేశాల కోసం, అలానే కేజ్రీవాల్ కు మద్దతు తెలపడం కోసం ముఖ్యమంత్రులు చంద్రబాబు,

మమతా బెనర్జీ, పినారయి విజయన్ లు నిన్న ఉదయమే ఢిల్లీ చేరుకొని కేజ్రీవాల్ ను కలుసుకునేందుకు లెఫ్టినంట్ ను అనుమతి కోరగా అయన నిరాకరించడంతో కేజ్రీవాల్ ఇంటికివెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయమై మా మద్దతు కేజ్రీవాల్ కు ఉంటుందని, ప్రధాని ఇకనైనా జోక్యం చేసుకుని సమస్యకు ముగింపు పలకాలని వారు అభ్యర్ధించారు. ఇక ఇంతవరకు బాగున్నా, మరి టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు ఇప్పటివరకు ఈ విషయమై మౌనం వహించారనేది ఎవరికి అర్ధం కావాడంలేదు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు తెలిపినప్పటికీ కేసీఆర్ మాత్రం ఇంకా ఎందకు రాలేదనేదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. అయితే కేసీఆర్ మాత్రం రేపు సోమవారం ఆ సమావేశాలకు హాజరయ్యే అవకాశం వుందని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కాగా కేసీఆర్ ఆ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ విచ్చేసిన సమయంలో కేజ్రీవాల్ వ్యవహారంపై ఎలా వ్యవహరిస్తారో అని అందరూ ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు….