టీఆర్ఎస్ గెల‌వ‌దు! కేసీఆర్‌లో ఆందోళ‌న‌!!

Sunday, October 21st, 2018, 10:12:13 AM IST

ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ప్ర‌తిసారీ అధికార మార్పు కోరుతుంటుంది. ఈ నేప‌థ్యంలో గులాబీ అధినేత భ‌య‌ప‌డుతున్నారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నీక‌ల్లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచినా ఇంకా ఏదో సందిగ్ధ‌త పార్టీని వెన్నాడుతోంది. ఇప్ప‌టికే 105 స్థానాల‌కు సంబంధించిన అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించి ప్ర‌చా జోరు పెంచిన కేసీఆర్ త‌ను ప్ర‌క‌టించిన అభ్య‌ర్థ‌ల్లో జోష్ నింప‌డానికి స‌మాయాత్త‌మ‌వుతున్నారు. ఇందు కోసం ఆదివారం మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల‌కు తెలంగాణ శాస‌న స‌భ్యుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేయ‌బోతున్నారు. క్షేత్ర స్థాయిలో ప్ర‌భుత్వానికి, పార్టీ ప్ర‌తినిధుల‌కు ఎదుర‌వుతున్న వ్య‌తిరేక‌త‌కు కార‌ణం ఏంటీ?. అస‌లు ఎందుకు వ్య‌తిరేక‌త వ‌స్తోంది. అభ్య‌ర్థులను వ్య‌తిరేకిస్తున్నారా? లేక పార్టీనే వ్య‌తిరేకిస్తున్నారా? పార్టీని వ్య‌తిరేకిస్తే ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి? అభ్య‌ర్థుల్నే వ్య‌తిరేకిస్తే ఎలాంటి వ్యూహాన్ని అవ‌లంభించాల‌నే దానిపై అభ్య‌ర్థుల‌తో కేసీఆర్ కూలంకుశంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హాకూట‌మి కారణంగా అభ్య‌ర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం కూడా అధికార టీఆర్ ఎస్ పార్టీకి బాగా క‌లిసి వ‌స్తోంది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని ప్ర‌జా క్షేత్రంలో తెరాస శ్రేణుల్ని హుషారెత్తించాల‌నే ఆలోచ‌న‌లో గుల‌బీ ద‌ళ‌ప‌తి వ్యూహాన్ని ర‌చించిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక ముంద‌స్తు ఎన్నిక‌లకు తెరాస ప్ర‌భుత్వం సిద్ధ‌మై 105 మంది అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించిన త‌రువాత అప్ప‌టి వ‌ర‌కు నివురుగ‌ప్పిన నిప్పులా వున్న అస‌మ్మ‌తి రాగం ఒక్క‌సారిగా భ‌గ్గు మంది. దీన్ని ఆస‌రాగా తీసుకుని తెరాస‌ను ఉక్కిరి బిక్కిరి చేయాల‌నుకున్న కాంగ్రెస్ ఎత్తుల‌ను కేసీఆర్ తెలివిగా తిప్పికొడుతూ వ‌స్తున్నాడు.

ఇదే పంథాను ఎన్నిక‌ల వ‌ర‌కు అవ‌లంభించి స‌మిష్టిగా ప్ర‌చారం చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. పార్టీపై , ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వున్న వ్య‌తిరేక‌త‌ను తెలివిగా త‌గ్గించి ఉద్య‌మ కాలంలో వాడిన వాడి వేడి ప్ర‌సంగాల‌తో మ‌ళ్లీ అధికారం చేజిక్కించుకోవాల‌న్న‌దే కేసీఆర్ ప్ర‌ధాన ఎత్తుగ‌డ‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. వ్య‌తిరేక‌ ప‌రిస్థితుల్ని కేసీఆర్ ఎలా త‌న‌కు అనుకూలంగా మార్చుకుని తెరాస‌ను మ‌ళ్లీ ఏ విధంగా అధికార పీఠం ద‌క్కించుకోనున్నాడో అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

  •  
  •  
  •  
  •  

Comments