పాడేరు లేడీ ఎమ్మెల్యే జంప్ వెన‌క అస‌లు వ్య‌థ‌!

Thursday, December 7th, 2017, 11:18:49 PM IST

నేను చెప్పేది వినండి మ‌హాప్ర‌భో! అని మొర‌పెట్టుకుంటే ఏ కార్య‌క‌ర్త మొర అయినా ఆల‌కించాలి నాయ‌కుడు అనేవాడు. కానీ త‌న విష‌యంలో అలాంటిది సాధ్య‌ప‌డ‌లేద‌ని ఆవేద‌న చెందుతున్నారు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి. వైకాపా నుంచి తాను తేదేపాలోకి ఎందుకు వెళ్లిపోవాల్సొచ్చిందో ఈ లేడీ ఎమ్మెల్యే ఒకానొక టీవీ ఇంట‌ర్వ్యూలో ప‌క్కా క్లారిటీతో వివ‌రించారు. త‌న ఇలాకాలో లోక‌ల్ కాని వేరొక నాయ‌కుడికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు జ‌గ‌న్‌. ఒక ప్ర‌భుత్వ బ్యాంకులో ప‌ని చేస్తున్న ఉద్యోగిని అంత‌కుముందే జ‌గ‌న్‌కి ప‌రిచ‌యం చేస్తే, అత‌డికి అవ‌కాశం ఉంటుంద‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్ చివ‌రి నిమిషంలో హ్యాండివ్వ‌డంతో అత‌హ‌శురాలిన‌య్యాన‌ని గిడ్డి ఈశ్వ‌రి తెలిపారు. ఆ క్ష‌ణం ఏం చేయాలో పాలుపోలేద‌ని, త‌న‌ని న‌మ్మి బ్యాంకు ఉద్యోగాన్నే వ‌దిలి వ‌చ్చేసిన త‌న అభ్య‌ర్థిని కాద‌ని జ‌గ‌న్ అలా మోసం చేయ‌డం త‌ట్టుకోలేక‌పోయాన‌ని, త‌న‌కు పార్టీలో ఏమాత్రం గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఈశ్వ‌రి ఆరోపించారు. అంతేకాదు.. జ‌గ‌న్ ఎంక‌రేజ్ చేసిన నాన్‌లోక‌ల్ వ్య‌క్తి గిరిజ‌నుడే కాద‌ని ఆరోపించారు ఈశ్వ‌రి. పాడేరులో లోక‌ల్ గిరిజ‌నుల‌కు ఇవ్వాల్సిన సీటు ఎటో వెళ్లిపోయింద‌ని ఆవేద‌న చెందారు. పైగా తాను చెప్పేది వినేందుకు జ‌గ‌న్ ఏమాత్రం ఆస‌క్తి చూపించ‌క‌పోగా, త‌న‌పై పెద్ద‌గా అరిచి రాద్ధాంతం చేశార‌ని, చెప్పింది వినాల్సిందేన‌ని హుకుం జారీ చేసి అవ‌మానించార‌ని ఈశ్వ‌రి ఇటీవ‌లి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

  •  
  •  
  •  
  •  

Comments