హీరోగారిపైనే ఎందుకీ నింద‌లు?

Friday, May 17th, 2019, 09:15:05 PM IST

వేలు పెడితే సంపూర్ణంగా వేలు పెట్టాలి కానీ.. మ‌ధ్య‌లో కెలికి వ‌దిలేయ‌కూడ‌దన్న తీరుగానే ఉందిట ఆ హీరోగారి వాల‌కం. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు చేయాల్సిన ప‌నిని హీరోగారే డిక్లేర్ చేయ‌డంపైనా ఇటీవ‌ల ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగింది. హీరోనే ఫింగ‌రింగ్ చేయ‌డం వ‌ల్ల ఆ సినిమా రిలీజ్ ఆల‌స్య‌మైందిట‌. కాన్వాసు పెరిగి అంత‌కంత‌కు చాంతాడంత సాగిందిట సినిమా. దాంతో మ‌ళ్లీ హీరోగారు సూచించిన‌ అన్ని సీన్లు క‌ట్ చేసి ఒరిజిన‌ల్ కు త‌గ్గ‌ట్టే సీన్ల‌ను తీర్చిదిద్ది తిరిగి రిలీజ్ చేసేప్ప‌టికి చాలానే ట్రామా న‌డిచింద‌ని చెప్పుకుంటున్నారు.

అయితే క్రియేటివిటీలో ఫింగ‌రింగ్ చేయ‌డాన్ని స‌ద‌రు హీరో స‌మ‌ర్ధించుకోవ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. న‌టుడిగా ఎదిగేందుకే ఈ త‌ప‌న‌. ప్రొడ‌క్ట్ క్వాలిటీని పెంచేందుకు ఇదంతా చేస్తాన‌ని.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆల‌స్యం చేస్తే త‌ప్ప త‌న‌వ‌ల్ల సినిమా ఎప్పుడూ ఆల‌స్యం కాద‌ని అంటున్నారట‌ స‌ద‌రు హీరో. అంతేనా.. త‌న కాల్షీట్లు అంద‌రికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయ‌ని.. తాను నిర్మాత‌ల హీరోని అని అంటున్నార‌ట‌. అంతా బాగానే ఉంది కానీ… స‌ద‌రు హీరో చెబుతున్న వెర్ష‌న్ .. నిర్మాత‌ల వెర్ష‌న్ తో సింక్ అవుతోందా? అంటే అస్స‌లు సింక్ అవ్వ‌డం లేద‌ని ఈ సినిమా వాయిదాల ఫ‌ర్వం చెబుతోంది. దాదాపు మూడు నెల‌ల‌కింద‌ట రావాల్సిన ఈ సినిమా ఇంత‌కాలం ఆల‌స్య‌మైంది. ఇప్ప‌టికి రిలీజైంది. అస‌లే ఈ సినిమా కోసం ఏకంగా ఒరిజిన‌ల్ తో పోల‌స్తే 50 కొత్త సీన్లు రాసుకుని వాటిని అతికించ‌డంతో అతుకుల బొంత అయ్యింద‌ని చెబుతున్నారు. ఒరిజిన‌ల్ లా ఉండాలా.. తెలుగు వారికి త‌గ్గ‌ట్టు మార్చాలా? అన్న డైల‌మా బాగా ఇబ్బంది పెట్టింది. హీరోగారి ఫింగ‌రింగ్ తో .. ఆ క‌న్ఫ్యూజన్ ఇంకా పీక్స్ కి చేరింద‌న్న ముచ్చ‌టా ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్స్ ని వేడెక్కిస్తోంది. కేవ‌లం 10-15 సీన్స్ మిన‌హా అన్నీ ఒరిజిన‌ల్ కి దూరంగా ఉన్నాయ‌న్న మాట‌ను హీరోగారే చెప్ప‌డంతో మ‌రికాస్తా డౌట్లు పుట్టుకొచ్చాయ్.