షాకింగ్ నిజం : జయలలిత మీద చేతబడి .. అందుకే చావు బతుకుల మధ్య

Thursday, November 3rd, 2016, 01:56:45 AM IST

Jayalalitha1
అనారోగ్యం తో చెన్నయి అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కి సంబంధించిన అనేక ఆస్తకికర కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆమె ఆరోగ్యం మీద ఒక ఊహించని వార్త అందరినీ అయోమయానికి గురి చేస్తోంది. ఆమె మీద కొందరు శత్రువులు చేతబడి చేయించారు అనీ అందుకే ఆమె అనారోగ్యానికి గురి అయ్యారు అనేది ఈ వార్తల సారాంశం. లండన్ నుంచి వచ్చే డైలీ మెయిల్ అనే పత్రిక ఒక కథనం ప్రచురించగా దాన్ని ఇప్పూ తమిళనాడు లో పెద్దగా చెప్పుకుంటున్నారు. ఈ పత్రిక ప్రకారం ఒక జ్యోతిష్యుడు ఆమెకి తీవ్రమైన అనారోగ్యం రావడానికి ముఖ్యకారణంగా ” చేతబడి ” అని చెప్పుకొచ్చాడు అనీ , శతృవులు ఈ రకంగా ఆమెకి హాని చెయ్యాలని కోరుకుంటున్నారు అని అతను చెప్పినట్టు ఆ పత్రిక రాసింది. కరుణానిధి అనారోగ్యానికి కూడా తాంత్రిక శక్తులే కారణమై ఉండవచ్చని జ్యోతిష్కుడు అభిప్రాయపడ్డట్టు తెలిపింది. ఈ వార్త ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది.