తాజా వార్త : ఆ మాజీ సిఎం తో కేసీఆర్ భేటీ దేనికి ?

Thursday, March 29th, 2018, 08:53:03 AM IST

ఓ వైపు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం నిరసనలు, పోరాటాలు జరుగుతుంటే, మరోవైపు ఇటు తెలంగాణాలో టిఆర్ ఎస్ పార్టీ అధినేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫ్రంట్ ఏర్పాటుకు అన్నివిధాలా వ్యూహాత్మకంగా ముంధుకు కదులుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో భేటీ అయిన కేసీఆర్, దీనికి కొనసాగింపుగా మరో సమావేశం నిర్వహించారు. అయితే ఈ దఫా తను అక్కడ పర్యటించకుండా ఆ మాజీ సీఎంను సకుటుంబంతో తన ఇంటికి ఆహ్వానించారు.

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ కలిశారు. ప్రగతిభవన్ లో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తో కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోరెన్ జాతీయ రాజకీయాలు, థర్డ్ ఫ్రంట్ తదితర అంశాలపై సీఎంతో చరచించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే హేమంత్ సోరెన్ థర్డ్ ఫ్రంట్ కు తన మద్దతు ప్రకటించిన విషయం విదితమే. గత 70 ఏండ్లుగా దేశాన్ని పాలించిన రెండు జాతీయపార్టీలు కాంగ్రెస్, బిజెపిలు ఘోరంగా విఫలం అయ్యాయని అందుకే పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆలోచనను ప్రారంభించామని వివరించారు.

దేశంలో తీవ్ర అసంతృప్తి ఉందని కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. మొన్నటికిమొన్న మహారాష్ట్రలో వేలమంది రైతులు పాదయాత్రగా వచ్చారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో ఎందుకు వస్తున్నాయి దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఉన్నది నలభైకోట్ల ఎకరాలు. ప్రతి పొలానికి నీరిచ్చినా కూడా ఇంకా 30వేల టీఎంసీల నీళ్లు అదనంగా ఉన్నాయి. అయినా 70 ఏళ్ళ పరిపాలనలో కూడా సాగునీళ్లు రావు, తాగునీళ్లు రావు. అందుకే ఈ దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సి ఉంది. జీడీపీలో మనకంటే తక్కువ ఉన్న చైనా మన కళ్ళ ముందే అభివృద్ధి చెందింది. అలానే జపాన్, సింగపూర్, సౌత్ కొరియా మనకంటే ముందుకు దూసుకెళుతున్నాయి అన్నారు. అందుకే ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ ఫ్రంట్ ఏర్పాటుతో ముందుకువెళ్తున్నామని కేసీఆర్ పునరుద్ఘాటించారు…..