మోహన్ బాబు, కొరటాల శివ మోధీని ఎందుకు టార్గెట్ చేసారు..?

Thursday, March 8th, 2018, 04:28:02 PM IST

గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంపై గానీ, ఇచ్చిన హామీలను గానీ మోదీ ప్రభుత్వం నేరవేర్చడంలేదన్న కోపంతో, ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్నా అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేస్తామన్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటు రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ మంత్రులు కూడా రాజీనామాలు సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు, దర్శకుడు కొరటాల శివ స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై ట్వీట్లు పెట్టారు.

మోహన్ బాబు ట్వీట్:

‘ఆంధ్రప్రదేశ్‌ పట్ల సవతి తల్లి తీరు ఎందుకు? ఏపీ ఏం తప్పు చేసింది? ప్రత్యేక హోదా గురించి ఏం జరుగుతోంది? అని ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా కల్పించాలని దాని విషయమై తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు తెలుపుతోంది. ఇంతటి చర్చానియాంశం పైన అసలు మీరేం పట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇది ఏపీ సెంటిమెంట్‌ మాత్రమే అని అనుకుంటున్నారా?’ అని మోహన్‌బాబు నరేంద్ర మోధీకి ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా కల్పించకపోవడంపై ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా బీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తు అతను కూడా ట్విటర్‌ ద్వారా స్పందించారు.

‘ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేద్దాం. అంటూ తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో ఓ భాగమేనని మీరు నిజంగానే భావిస్తున్నారా మోదీజీ?’ అసలు ప్రత్యేక హోదాపై, ఇచ్చిన హామీలపై ఈ నిర్లక్ష్య దోరణి ఏంటని ప్రశ్నిస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు కొరటాల శివ.