పవన్ కు దమ్ములేదా..?

Friday, September 5th, 2014, 05:49:42 PM IST


ఉపఎన్నిక రణరంగం ఊపందుకుంది. సవాళ్లు ప్రతిసవాళ్ళతో నాయకులు బిజీగా ఉన్నారు. నరాలు తెగే ఉత్కంఠతో జనాలున్నారు. 13వ తేది దగ్గరపడుతుండటంతో పార్టీలు ప్రచారంలో బిజీ అవుతున్నాయి. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యర్ధి పార్టీలపై తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు.
మెదక్ లో జగ్గారెడ్డి గెలిస్తే తెరాస నేత హరీష్ రావు రాజకీయ సన్యాసం చేస్తారా అని ఎర్రబెల్లి సవాల్ విసిరారు.. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ…తానూ ఎర్రబెల్లి సవాల్ ను స్వీకరిస్తున్నానని, జగ్గారెడ్డి కనుక మెదక్ లో గెలిస్తే.. రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలనుంచి భేషరతుగా తప్పుకుంటానని, ఒక వేళ జగ్గారెడ్డి ఓడిపోతే..ఎర్రబెల్లి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా అని ప్రశ్నించారు.. భారతీయ జనతా పార్టీకి అభ్యర్ధి దొరక్కనే జగ్గారెడ్డిని తెరపైకి తెచ్చారని ఆయన అన్నారు. జగ్గారెడ్డి టిక్కెట్ ఇప్పించడంలో ప్రముఖ పాత్ర పోషించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పత్తా ఎక్కడో ఇంతవరకు తెలియలేదని, జగ్గారెడ్డికి మద్దతుగా పవన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెదక్ లో ప్రచారం చేసే దైర్యం ఉన్నదా.. అని హరీష్ రావు ప్రశ్నించారు. వారికి ధైర్యం ఉంటే ప్రచారం చేయడానికి రావాలని హరీష్ రావు సవాల్ విసిరారు.