రణవీర్ సింగ్ ‘అర్జున్ రెడ్డి’కి అందుకే నో చెప్పాడట..నమ్మొచ్చా..!

Tuesday, January 30th, 2018, 08:00:50 PM IST

పద్మావతి చిత్రంలో తన విలక్షణ నటనని బయటపెట్టిన రణవీర్ సింగ్ నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కాడు. అటువంటి రణవీర్ సింగ్ కు ఎలాంటి పాత్రలో అయినా నటించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. బాహుబలి తరువాత ఇండియాలో అంతటి హాట్ టాపిక్ గా మారిన చిత్రం అర్జున్ రెడ్డి. తెలుగులో యువత ఈ చిత్రానికి బ్రహ్మ రథం పట్టారు. దీనితో అర్జున్ రెడ్డి రీమేక్ హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. తమిళంలో సీనియర్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ అర్జున్ రెడ్డిగా కనిపించబోతున్నాడు. హిందీలో కూడా ఈ చిత్ర రీమేక్ కు మంచి ఆఫర్ అందింది.

తెలుగు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీపే హిందీలో కూడా అర్జున్ రెడ్డిని చిత్రీకరించనున్నారు. కాగా సందీప్ మొదటగా ఈ చిత్రానికి రణవీర్ సింగ్ ని హీరోగా అనుకున్నారు. రణవీర్ సింగ్ ఈ చిత్రానికి ఫర్ఫెక్ట్ ఛాయిస్ చాలా మంది తెలిపారు కూడా. కానీ రణవీర్ సింగ్ అంగీకరించక పోవడంతో షాహిద్ కపూర్ వద్దకు ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో రణవీర్ సింగ్ అర్జున్ రెడ్డి చిత్రానికి నో చెప్పడానికి గల కారణాన్ని రణవీర్ వివరించాడు. అతడు చెప్పిన సమాధానం ఆశ్చర్యకరంగా ఉంది. ఆ చిత్రంలో ఆల్కహాలిక్ గా నటించాలి. కానీ నిజజీవితంలో నేను మద్యం సేవించను. నాకు ఆ అలవాటు లేదు. నాకు అలవాటు లేని పాత్రని రియలిస్టిక్ గా చేయలేను. అందుకే అర్జున్ రెడ్డి చిత్రాన్ని రిజెక్ట్ చేశా అంటూ రణవీర్ చెప్పుకొచ్చాడు. నమ్మే సమాధానమేనా ఇది..!!