ఆ విషయమై ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్నే నిలదీస్తున్నారు : నిర్మల సీతారామన్

Sunday, June 10th, 2018, 12:45:22 PM IST

ఇటీవల తమిళనాడులోని తూతుక్కుడి స్టెరిలైట్ రాగి కర్మాగారం విషయంలో జరిగిన ఆందోళనకారుల మరణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదని కొంత వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నోరోజుల నుండి జరుగుతున్న ఈ వివాదంపై నేడు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తన అభిప్రాయం వ్యక్తం చేసారు. స్టెరిలైట్ విషయంలో చేపట్టిన ఉద్యమం శాంతి బాటలో 99 రోజులపాటు జరిగింది, అటువంటిది వందవరోజు ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగడంతో ఆ సమయంలో పోలీస్ లు జరిపిన కాల్పుల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారని, నిజానికి ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎన్నాళ్ళు ఎంతో శాంతియుతంగా జరిగిన ఉద్యమం ఒక్కసారిగా ఎందుకు తీవ్రతరంగా హింసాత్మకబాట పట్టిందో అక్కడి స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సమాధానం చెప్పాలని,

కానీ ఎందుకు అందరూ మోడీని టార్గెట్ చేస్తున్నారని ఆమె అన్నారు. అయినప్పటికీ తాను ఈ విషయమై మోడీని కలిసి విన్నవించి తగు చర్యలు తీసుకునేలా మాట్లాడతాను అన్నారు. వాస్తవానికి ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న వ్యర్ధ వాయువుల వల్ల అక్కడి వాతావరణం, గాలి కలుషితమౌతోందని, అందువల్ల ఫ్యాక్టరీ ని వెంటనే మూసివేయాలని చేస్తున్న ఉద్యమం మంచిది కాదని, మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడి వారికీ తగిన న్యాయం చేయాలనీ ఆమె కోరారు. ఈ మధ్య ఎటువంటి ఘటన జరిగినా దానిని కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించడం మామూలైపోయిందని, అది సరైన పద్ధతి కాదని హితవు పలికారు……

  •  
  •  
  •  
  •  

Comments