ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వేలో వైసీపీకి ఎందుకు సీట్లు తగ్గాయో తెలుసా..!

Thursday, May 16th, 2019, 12:12:36 AM IST

ఏపీలో గత నెల 11న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే వాటి ఫలితాలు ఈ నెల 23న ఉండడంతో అందరిలోనూ గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికలు కాస్త పోటీపోటీగా సాగాయి. అయితే ఇప్పటికే వెలువడిన సర్వేలలో చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నా, కొన్ని సర్వేలు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ సర్వే ఫలితాలను అంచనా వేసుకుంటున్న నేతలు గెలుపు మాదంటే మాదని ఒకరికొకరు చెవులు కొరుకునేలా చెప్పుకుంటున్నారు.

అయితే ఏపీ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని చాలా జాతీయా మీడియా సర్వేలు కూడా వైసీపీదే అధికారమని చెబుతుండడంతో వైసీపీ శ్రేణులు ఇప్పటి నుంచే గెలుపుపై ధీమాగా ఉన్నారు. అంతేకాదు జగన్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తాన్ని, మంత్రివర్గ విస్తరణలో అవకాశాలను గూర్చి కూడా చర్చించుకుంటున్నారట. అయితే గత మూడేళ్లుగా వైసీపీకి ఎన్నికల వ్యూహ కర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత చాలా సర్వేలు చేయించాడు. అయితే అన్నీ సర్వేలను ఆధారంగా చేసుకుని చూస్తే ఓటర్ల నాడీ ఒక్కొక్కసారి ఒక్కొలా ఉందని తెలిసింది. ఒకసారి వైసీపీ అని చెప్పిన వ్యక్తి మరో సారి టీడీపీ అని చెప్పారట. అయితే చివరకు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ కిషోర్ ఒక సర్వేను రిలీజ్ చేశాడు. అన్ని సర్వేల లాగానే ఇందులో కూడా వైసీపీనే గెలుస్తుందని చెప్పినా, వైసీపీ గెలిచే సీట్లు మాత్రం అన్ని సర్వేల కన్నా తక్కువగా ఉన్నాయని చెప్పాడు. అయితే అన్ని సర్వేలు వైసీపీకి 110 నుంచి 130 సీట్ల గెలుచుకునే అవకాశం ఉందని చెబుతుంటే, ప్రశాంత్ కిషోర్ మాత్రం 107 సీట్లు గెలుచుకుంటుందని చెప్పాడు. ఇలా ఎందుకు చెప్పాడన్న దాని వెనుక కూడా ఒక విషయం దాగి ఉందట. చివరలో చంద్రబాబు టీడీపీ ఓటమిని పసిగట్టి పసుపు కుంకుమ అంటూ ప్రవేశపెట్టిన పథకం వలన మహిళల ఓట్లు చాలా వరకు టీడీపీకే పడ్డాయని అది పూర్తిగా భయటకు తెలియకపోయినా జరిగిన వాస్తవం అదేనని అందుకే ప్రశాంత్ కిషోర్ సర్వేలో వైసీపీ తక్కువ సీట్లు గెలుచుకోబోతుందని రాజకీయ వర్గాలలో, వైసీపీ శ్రేణులలో చర్చలు జరుగుతున్నాయట. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలు ఖచ్చితంగా ఉంటాయ లేదా అనేది మాత్రం తెలియాలంటే మే 23 వరకు వేచి ఉండాల్సిందే.