మీ దగ్గర సిమ్ లేకపోయినా సరే కాల్స్ మాట్లాడండి ఇలా…

Thursday, May 3rd, 2018, 03:18:36 PM IST

ఫోన్ సిగ్నల్స్ సరిగా లేని, మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా లేని ప్రదేశంలో ఉండికూడా ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ ఫోన్‌కు కాల్స్ చేసుకునే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి రానున్నది. వైఫై బ్రాడ్‌బ్యాండ్ ద్వారా మీరు ఇంటర్నెట్ టెలిఫోనీని ఉపయోగించుకోవచ్చు. ఈమేరకు దేశంలో ఇంటర్నెట్ కాలింగ్‌కు అవకాశం కల్పించే ప్రతిపాదనకు ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ సేవలను లైసెన్సు పొందిన టెలికం ఆపరేటర్లు, ఇతర కంపెనీలు అందిస్తాయి. ఈ కంపెనీలు వినియోగదారులకు 10అంకెల కొత్త ఫోన్‌నెంబరును పొందుతాడు. సాధారణ ఫోన్ నెంబరులాగే ఉండే దీనికి ఎలాంటి సిమ్ అవసరముండదు. కాకపోతే మొబైల్‌లో ఇంటర్నెట్ టెలిఫోనీకి సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ వాయిస్ కాల్స్‌తో పోల్చితే ఇంటర్నెట్ కాలింగ్ తక్కువ ధరతో కూడుకున్నదని ట్రాయ్ తెలిపింది. దీని ద్వారా కాల్ సక్సెస్ రేటు పెరుగుతుందని, కాల్ డ్రాపింగ్ సమస్యలు ఉండవని తెలిపింది.