జగన్ వైపు జనసేనాని చూపు…?

Thursday, November 1st, 2018, 11:08:23 AM IST

జనసేన ఏ పార్టీతో పొత్తు ఆశించట్లేదని, ఒంటరిగానే పోటీ చేసి తామేంటో చూపిస్తాం అని జనసేన అధినేత కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటన విషయంలో అంత స్పష్టత లేనప్పటికీ జనసేన పార్టీ పొత్తు విషయం లో పుకార్లు మాత్రం ఆగట్లేదు. తాజాగా జనసేన నుండి వైసీపీ పొత్తు గురించి రాయబారం వెళ్లినట్టు వార్త వినిపిస్తుంది. ఈ రాయబారం వెనక బొత్సా, చిరంజీవి ముఖ్య పత్రాలు పోషిస్తున్నారట, ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కీలక నేత అతని సన్నిహితుల వద్ద ధృవీకరిచినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయమై ఇరు వర్గాలు లీకులు రాకుండా వయవహరించటం గమనార్హం.

జగన్ పవన్ కలిస్తే ఇద్దరిలో ఎవరికెంత లాభం అన్న అంశం పై తర్జన భర్జనలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదెలా ఉన్నా అధికార పక్షానికి మాత్రం ఈ కలయిక తీవ్ర నష్టాన్నే చేకూరుస్తుందని చెప్పాలి. ఇప్పటికే చంద్రబాబు నక్కజిత్తుల రాజకీయాల వల్ల వైసీపీ కి ఎమ్మెల్యేల సంఖ్య తగ్గినా, జగన్ కు ప్రజా బలం మాత్రం మాత్రం అనూహ్యంగా పెరిగింది. పవన్ యాత్రల పేరుతో నిరంతరం పరాజయాల మద్యే ఉండటానికి ప్రయత్నిస్తుండటంతో తన వర్గపు ఓటు బ్యాంకు చేలా చెదురు కాకుండా చుస్కోవటంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇటీవలే జగన్ హత్యకు కుట్ర జరిగి టీడీపీ తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టయింది. వైసీపీ వర్గాలు ఏ మాత్రం సమన్వయం కోల్పుకుండా వ్యహరించటంతో ప్రజల దృష్టిలో ఇంకో మెట్టు ఎదిగినట్టయింది.

ఈ దాడి విషయంలో జగన్ కు సింపతీ వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెడితే, దాడి సమయంలో, తర్వాత జరుగుతున్న సంఘటనలను బట్టి చుస్తే, పరాజయాల దృష్టిలో టీడీపీ పూర్తిగా పల్చన అయింది. జగన్ మాత్రం మరోసారి నిజాయితీ, నిర్భీతి గల నాయకుడిగా ప్రజల మనసులో స్థానం సంపాదించాడు.ఈ నేపథ్యంలో వైసీపీతో కలిసి నడిస్తేనే తమకు లాభిస్తుందని జనసేన వర్గాలు పుకార్లు వినిపిస్తున్నాయి.

తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం గతంలో ప్రజారాజ్యం పోటీ చేసిన గెలిచినా స్థానాలు ఇప్పుడు జనసేనకు కేటాయిస్తే లాభం ఉంటుందని ఆ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం, అయితే ఈ వ్యవహారం ఇంకా జగన్ దగ్గరకు వెళ్లలేదట, సందర్భం చిక్కినప్పుడల్లా పవన్ పై తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న జగన్ అసలు ఈ పొత్తుకు ఒప్పుకుంటాడా లేదా, సీట్ల సర్ర్దుబాటు చేస్తాడా అన్నదే ప్రశ్న. ఏదేమైనా ఈ కలయిక కార్యరూపం దాలిస్తే జగన్ కంటే పవన్ పార్టీకే లాభం అని విశ్లేషకుల అభిప్రాయం, అధికార పక్షానికి మాత్రం శాశ్వత సమాధి ఖాయం.

  •  
  •  
  •  
  •  

Comments