అమ్మ కోసం అన్ని చేసిన అజిత్..ఆ ఒక్కటీ చేయలేడా..?

Thursday, February 9th, 2017, 05:59:22 PM IST


”ఆమె నా అమ్మ లాంటిది..అజిత్ నా కొడుకులాంటి వాడు”. ఈ రెండు మాటలు చాలు హీరో అజిత్, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లకు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిదో తెలియడానికి. జయ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పుడు కూడా అమ్మ తరువాత అన్నా డీఎంకే వారసుడు అజితే అనే ప్రచారం జరింగింది. కానీ అజిత్ తన తల్లి అని భావించే జయ పటిష్ట పరచిన అన్నా డీఎంకేలో నేడు సంక్షోభం రగులుకుంటోంది. ఇంతవరకు కనీసం సర్పంచ్ కూడా కానీ శశికళ, ధీటైన నాయకుడిగా పేరు పొందలేకపోయిన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవులకోసం పార్టీ ని సంక్షోభంలోకి నెడుతున్నారు.రాజకీయాలతో ఎటువంటి సంభందం లేని నటులు కమల్ హాసన్, గౌతమి వంటి వారుకూడా రాజకీయ సంక్షోభం కారణంగా రాష్ట్రం దెబ్బ తినకూడదని అనుభవమున్న పన్నీర్ సెల్వం కు జై కొడుతున్నారు. ఇంకా పలువురు సినీ తారలు వారికి తోచిన విధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం స్పందిస్తున్నారు.

కానీ జయలలితని తన తల్లిలా భావించే అజిత్ మాత్రం ఇంతవరకు తన స్పందనని తెలియజేయలేదు. పలువురు అమ్మ మరణంపై అనుమానాల్ని వ్యక్తపరుస్తున్నా, అన్నా డీఎంకేలో రాజకీయ సంక్షోభంలో నెలకొన్నా అజిత ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్న వినిపిస్తోంది. అజిత్ ని తన వారసుడిగా ప్రకటిస్తూ జయ వీలునామా కూడా రాశారనే ప్రచారం కూడా ఉంది. అజిత్ ని తెరమీదికి రాకుండా శశికళ అడ్డుకుందని వాదించే వారు కూడా ఉన్నారు. ఓ కార్యక్రమంలో అమ్మకు మద్దతుగా డీఎంకే నిసైతం అజిత్ విమర్శించాడు.రాజకీయాలను సినిమాల్లోకి లాగవద్దని కరుణానిధి కౌంటర్ ఇవ్వడంతో సూపర్ స్టార్ రజిని లేచి మరీ మద్దత్తు ప్రకటించారు.2015 లో వేదలమ్ సినిమా విడుదల నేపథ్యంలో అజిత్ అమ్మని వెళ్లి కలిశాడు. ఆ సమయంలో అజిత్ ని ఆరోగ్యం విషయంలో అమ్మ హెచ్చరించిందట. అప్పటినుంచి ఆమె స్పూర్తితో జిమ్ కు వెళ్లడం ప్రారంభించాడట. జయ అనారోగ్యంతో ఉండగా మొదట పరామర్శించింది అజితే. అమ్మకోసం అన్ని చేసిన అజిత్ ఆమె బలపరిచిన అన్నా డీఎంకే పార్టీ సంక్షోభంలో ఉండగా ఎందుకు స్పందించడం లేదనే వాదన వినిపిస్తోంది.