40 ఎమ్మెల్యేలు పన్నీర్ వైపు రానున్నారా.. స్వామి పరిస్థితి ఏంటి..?

Friday, February 17th, 2017, 06:18:44 PM IST


పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం సాఫీగానే జరిగింది. కానీ రేపు ఆయనకు బల పరీక్ష ఎదురుకానుంది. కానీ ఇదిమాత్రం అంత సాఫీగా జరిగే అవకాశం లేదనే ప్రచారం జరుగుతుంది. శశికళ ఎమ్మెల్యేలను రిసార్ట్ లో దాచిన సమయంలోనే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు శశికళను ఎదురు తిరిగినట్లు తెలుస్తోంది. కానీ ఆ సమయానికి వారిని ఎలాగో సముదాయించారట.

దీనితో రేపు జరగబోయే బల పరీక్షలో అందరూ తనకు మద్దత్తు ఇస్తారో ఇవ్వరో అనే సందేహంలో పళనిస్వామి ఉన్నట్లు తెలుస్తోంది.అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను సముదాయించడానికి బెంగుళూరు పర్యటనని కూడా రద్దు చేసుకున్నారు. పళని స్వామి బెంగుళూరులో శశికళని పరామర్శించడానికి వెళ్లవలసి ఉంది.ఆ పర్యటనని పళని స్వామి రద్దు చేసుకున్నారు. కాగా మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ పళని స్వామి ముఖ్యమంత్రి కావడంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పన్నీర్ వర్గం లో సైతం చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమ్మ ఫోటో పెట్టుకుని గెలిచిన తాను అమ్మ వ్యతిరేకుల వైపు ఉండలేనని స్పష్టం చేశారట. సెంగొట్టియాన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై కూడా అమ్మ భక్తులు చాలా మంది కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది.పళని స్వామి ముఖ్యమంత్రి గా కొనసాగాలంటే కనీసం 117 మంది ఎమ్మెల్యేల మద్దత్తు అవసరం. ప్రస్తుతం శశికళ వర్గంలో 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.