ఆ మంత్రిగారిపై వేటు ప‌డ‌నుందా?

Friday, September 30th, 2016, 08:18:03 AM IST

achem-naidu
కొత్త రాజ‌ధాని అమరావ‌తి నుంచి పాల‌న సాగిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జిల్లాల ప‌నితీరును స్వ‌యంగా స‌మీక్షిస్తున్నారు. జిల్లాల అభివృద్ధి లో భాగంగా ఎ, ఎ- ప్ల‌స్, ఎ- ప్ల‌స్ ప్ల‌స్ గ్రేడ్ లుగా డివైడ్ చేసి మంత్రుల‌తో లింక్ అప్ చేయ‌డం జ‌రిగింది. ప‌థ‌కాలు, స‌హ‌జ వ‌న‌రుల వినియోగం, నీరు, పాల‌న‌, సామాజిక అభివృద్ధి స‌హా ప‌లు అంశాల‌తో ఈ రేంటింగ్స్ ను ప్ర‌క‌టింస్తున్నారు. అన్ని జిల్లాల విష‌యంలో బాబు సంతృప్తిగా ఉన్నా శ్రీ‌కాకుళం జిల్లా వెనుకబాటుత‌నంపై మంత్రి అచ్చె నాయుడుని పిలిపించి క్లాస్ పీకార‌ట‌.

స‌హ‌జ వ‌న‌రులు, స‌ముద్ర తీరం ఉన్న జిల్లాను అభివృద్ది ప‌ర‌చ‌డంలో విఫ‌ల‌మయ్యారంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చార‌ట‌. పార్టీలో ఎప్ప‌టి నుంచో సీనియ‌ర్ నాయ‌కుడిగా…రెండేళ్ల పాటు మంత్రి ప‌ద‌విలో ఉన్నా జిల్లాను పెడ‌చెవిన పెట్ట‌డంపై అసంతృప్తిని వ్య‌క్తం చేశార‌ట‌. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అచ్చె నాయుడుపై వేటు ప‌డుతుందేమోన‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.