చిరు, నా దారి తమ్ముడి దారే అంటారా?

Thursday, July 12th, 2018, 10:05:35 AM IST

2009 ఎన్నికల సమయంలో, అప్పట్లో సినీ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన మెగా స్టార్ చిరంజీవి తొలుత ఆయన తిరుపతిలో ఏర్పాటు చేసిన పార్టీ భారీ బహిరంగ సభలో పార్టీ పేరు, మరియు గురుతు ప్రకటించి పెను సంచలనం సృష్టించారు. అయితే నాడు టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ మాదిరిగా మెగాస్టార్ కూడా రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని అందరూ అనుకున్నారు. అక్కడినుండి ఆయన ప్రచారానికి వెల్లిని ప్రతి చోట ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే ఇక చివరకు ఎన్నికల సమయం రావడంతో మెగాస్టార్ గెలుపుని చాల మంది మంచి నమ్మకమే పెట్టుకున్నారు. కానీ ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రజలు చేదు తీర్పుని ఇచ్చి కేవలం 18 సీట్లు మాత్రమే ఇచ్చారు. అయితే ఆ తరువాత మెల్లగా ఒక్కరొక్కరుగా పార్టీ నుండి నేతలు బయటకు వెళ్లడం జరిగింది. ఇక ఆ తరువాత ఎదురైనా పరిస్థితులను బట్టి చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆ తరువాత కాంగ్రస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది కూడా. ఇంతవరకు బానే వున్నా, ఆ తరువాత అనూహ్యంగా 2014లో పవన్ జనసేన పార్టీని స్థాపించారు.

అయితే గత ఎన్నికల సమయంలో ఏపీ విడిపోవడంతో ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీ చేయకుండా,కేవలం తమ పార్టీ తరపున టీడీపీకి మద్దతిచ్చారు. ఆ తరువాత టిడిపి అద్భుతవ విజ్జయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందారని, అప్పటి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదా అని బాధపడుతున్నామని, కావున రానున్న ఎన్నికల్లో ఏపీలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి ఎన్నికల బరిలో దిగుతామని పవన్ అన్నారు. కాగా ఇప్పటికే పవన్ పార్టీలోకి కూడా చేరికలు బాగానే జరుగుతున్నాయి. పవన్ తన పార్టీ పెట్టింది ప్రశ్నించడానికేనని, తమ పార్టీ ప్రజా సంక్షేమం, వారి శ్రేయస్సు కోసమే పుట్టిందని అన్నారు. ఇక ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించి ఒక వార్త రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది, అదేమిటంటే పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి త్వరలో జనసేన చేరనున్నారట. కొన్నేళ్ల నుండి కాంగ్రెస్ లో ఉంటూ వస్తున్న చిరంజీవి ఆ పార్టీ ఏపీలో పూర్తిగా అట్టడుగుకు వెళ్లిపోవడంతో కొంత ఆలోచనలో పడ్డారని సమాచారం.

పైగా ఇప్పటికిపుడు కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవితం చేయడం కష్టతరమని, ఆలా జరగడానికి ఇంకా చాల సమయం పడుతుందని అంటున్నారు. ఈ సమయంలోనే పార్టీ లోనే కొందరు సీనియర్లు ఇతర ప్రధాన పార్టీలవైపు చూస్తున్నట్లు సమాచారం. ఇటువంటి సమయంలో చిరంజీవి కూడా పార్టీ మారితే మంచిదనే భావనలో ఉన్నారట. అయితే మొన్న జరిగిన చిరంజీవి అభిమానుల కలయిక సభలో, అభిమానులు చాలామంది జనసేన పార్టీలో చేరడంతో ఈ వార్త మరింత ఊపందుకుంది. ఇక త్వరలోనే చిరంజీవి కూడా తమ్ముడి పార్టీ లోకి వస్తున్నారు, అయితే అది రానున్న రోజుల్లో అతిత్వరలో వుండనుందట. ఇప్పటికే ఈ విషయమై చిరు, పవన్ ల మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందని, త్వరలోనే దీనికి సంబంధించి జనసేన పార్టీ ప్రకటన కూడా చేసే ఆవాసం లేకపోలేదని అంటున్నారు. ఒకవేళ చిరంజీవి తమ్ముడి పార్టీలోకి వస్తే జనసేనకు రాజకీయంగా, ఓట్ల పరంగా కొంత మేర అయినా బలం చేకూరినట్లే అనేది కొందరి వాదన. కాబట్టి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో షికారు చేస్తున్న ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నాళ్ల వరకు వేచి చూడవలసిందే…..

  •  
  •  
  •  
  •  

Comments