ఇలా అయితే మహాకూటమి కూలిపోతుంది..!?

Sunday, October 21st, 2018, 02:21:09 PM IST

తెలంగాణా రాష్ట్రంలో అత్యంత బలమైన పార్టీ ఏదంటే తెరాస పార్టీ అనే చెప్పాలి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పార్టీ మీద ఏ ఇతర పార్టీ ఒంటరిగా పోటీ చేసినా సరే ఓడిపోతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు అందుకనే అక్కడి ఇతర పార్టీల వారు తెరాస పార్టీ మీద ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే ఓటమి ఖాయం అని టీకాంగ్రెస్,తెలుగుదేశం మరియు ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిసి ఒక మహా కూటమి అనే పేరిట పొత్తులు పెట్టుకొని రాబోయే ఎన్నికల బరిలోకి దిగనున్నారు.అయితే వీరి యొక్క ప్రధాన లక్ష్యం కేవలం తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించడమే అని ఎప్పుడో ప్రకటించారు.ఈ మహాకూటమిలోని మూడు ముఖ్య పార్టీలు ఉండగా టీకాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగానే మిగతా పార్టీలు నడుచుకుంటున్నాయనే చెప్పాలి.

ఆ మధ్య సీట్ల కేటాయింపు విషయంలో టీకాంగ్రెస్ కు తెలుగుదేశం పార్టీ వారికి చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా సరే అవి సర్దుమణిగిపోయాయి.ఆ తర్వాత టీడీపీ వారే మాకు సీట్ల కేటాయింపు కన్నా కెసిఆర్ సర్కార్ ని అధికారం నుంచే దించడమే లక్ష్యం అని పేర్కొన్నారు.ఇప్పుడు మళ్ళీ తాజాగా వీరి కూటమికి సంబందించిన సిపిఐ పార్టీ కి ఆశించిన స్థాయిలో సీట్లు టీకాంగ్రెస్ వారు ఇవ్వడం లేదని సిపిఐ వారు వాదిస్తున్నారు.ఈ రోజు జరిగినటువంటి అత్యవసర మీటింగులో సిపిఐ పార్టీ కి కేవలం రెండు నుంచి మూడు సీట్లు మాత్రమే కేటాయిస్తామని టీకాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పెయ్యగా ఆ భేటీ నుంచి కూనంనేని సాంబశివరావు అలిగి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది.

మొదటి నుంచి మేము 12-13 సీట్లు అడిగితే వీరు కేవలం 2-3 సీట్లు మాత్రం కేటాయించడం మాకు అవసరం లేదని అక్కడి సిపిఐ నేతలు తేల్చి చెప్పేశారు.అవసరమైతే మహా ఓటమి నుంచి తప్పుకొని ఒంటరిగా అయినా సరే పోటీ చేస్తామని తెలిపారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో టీకాంగ్రెస్ నేతలు ఏ తప్పటడుగు వేసినా సరే దాని పరిణామం పెద్ద స్థాయి లోనే ఉంటుందని చెప్పాలి.వీరి కూటమి నుంచి ఏ కొన్ని ఓట్లు తప్పినా సరే వీరి ఓటమికి దారి తీస్తాయని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.దీన్ని బట్టి వారు సరైన నిర్ణయాలు తీసుకంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.