హైదరాబాద్ కు ఆ శక్తి ఉంది

Sunday, September 14th, 2014, 12:11:48 PM IST


హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేవారు ఆనందంగా పెట్టోచ్చని..సందేహించాల్సిన అవసరం లేదని.. కేంద్ర పట్టణాభివృద్ది శాఖమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ ఉప్పల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ అన్నివర్గాల ప్రజలలో విశ్వాసం నింపారని, ఏదైనా సాధించవచ్చనే భరోసా ఇచ్చారని ఆయన అన్నారు. అత్యుత్తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శించే సంస్థలను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంలో నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన అన్నారు. హైదరాబాద్ కు ప్రపంచాన్ని ఆకర్షించే శక్తి ఉందని వెంకయ్యనాయుడు తెలియజేశారు.