జేడీ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీలో చేరనున్నారా..?

Sunday, September 16th, 2018, 04:27:30 PM IST

మాజీ సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఈయన పేరు చెప్తే అవినీతి పరుల గుండెల్లో దడ మొదలవుతుంది. ఆయన వృత్తిలో ఉండగా ఎంతో మంది అవినీతిపరుల భరతం పట్టారు. ఆయన చేసే వృత్తిలో ఎందుకో ఆయనకి అసంతృప్తి అనిపించింది ఏమో ఆ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేసేసారు. నేరుగా ప్రజల్లో ఉండడానికి వారి యొక్క కష్టాలను తెలుసుకోడానికి ఆంధ్ర రాష్ట్రం లో పర్యటన చేపట్టారు.ఈయన పర్యటనలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం లోని చాలా చోట్ల ముఖ్యంగా పల్లెలలో అణచివేయబడిన ప్రాంతాలలో ముమ్మరంగా పర్యటన చేస్తూ వారి యొక్క కష్టాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు.

ఇటీవలె ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా దిగుతున్నా అంటూ ప్రకటించారు. కానీ ఆయనకి పదివి పట్ల ఆశాభావం లేదని వెల్లడించారు.ముందు ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవడమే ముఖ్యం అని వెల్లడి చేశారు.ఐతే సిద్ధాంతం పరంగా భావజాలం పరంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జేడీ గారికి కొన్ని తారతమ్యాలు ఉన్నాయి అని చాలా మంది అంటున్నారు. ఐతే తాజాగా తెలిసిన వార్తల ప్రకారం జెడీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు వైసీపీ గాని తెలుగుదేశం పార్టీతో గాని కలిసి పనిచేసే అవకాశాలు అస్సలు లేవని, వారి యొక్క భావాలతో ఈయన సిద్ధాంతాలకు అసలు పొంతన అనేది ఉండదు అని తెలిపారు. ఐతే వస్తున్న కథనాల ప్రకారం జేడీ గారు జనసేన పార్టీ తో కలిసి ముందుకు సాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి అని తెలుస్తుంది.పవన్ మరియు జేడీలు కలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments