బిగ్ బ్రేకింగ్ : కేంద్ర ఇంటెలిజెన్స్‌ స‌ర్వేలో వైసీపీ గెలిచే, ఓడే సీట్లు ఇవే..!

Monday, April 22nd, 2019, 04:46:02 PM IST

ఈ ఏడాది ఏప్రిల్ 11న ఏపీలోని అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అదే సంద‌ర్భంలో ఎన్నిక‌లు పూర్త‌యిన నాటి నుంచి వెలువడుతున్న స‌ర్వేల‌న్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వ‌చ్చాయి. మే 23న వెలువ‌డ‌నున్న ఎన్నిక‌ల ఫలితాల త‌రువాత టీడీపీ అధికారం నుంచి వైదొలిగి.. వైసీపీ అధికార ప‌గ్గాలు చేప‌డుతుంద‌ని ఆ స‌ర్వేల‌న్నీ వెల్ల‌డించాయి.

అంతేకాకుండా, జాతీయ స్థాయి ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా ఎగ్జిట్‌పోల్స్ అధ్య‌య‌నాలు నిర్వ‌హించాయి. ఆ ఎగ్జిట్‌పోల్స్‌లో వైసీపీ క‌చ్చితంగా 105 ఎమ్మెల్యే స్థానాల‌ను గెలుపొందుతుందని స్ప‌ష్టం చేసింది. మ‌రికొన్ని స‌ర్వే ఏజెన్సీలు మాత్రం వైసీపీ 120 – 130 ఎమ్మెల్యే సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని ఫ‌లితాల‌ను వెల్ల‌డించాయి.

ఇక అధికార పార్టీ టీడీపీ అనేక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ట‌ఫ్ పోటీ ఇచ్చినా ఆఖ‌ర‌కు 65 నుంచి 70 ఎమ్మెల్యే సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మవుతుంద‌ని కేంద్ర స్థాయిలోని ఇంటెలిజెన్స్ విభాగం స్ప‌ష్టం చేసింది. ఇక జ‌న‌సేన విష‌యానికొస్తే, త‌క్కువ‌లో త‌క్కువ ఎలా లేద‌న్నా రెండు నుంచి మూడు ఎమ్మెల్యే స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని, ఎంపీ సీటు గెలుపొందే అవ‌కాశ‌మే లేద‌ని స‌ర్వేలు తెలిపాయి.

వైసీపీ ఎమ్మెల్యే స్థానాల‌ను అత్య‌ధిక సంఖ్య‌లో గెలుపొందినా, ఎంపీ అభ్య‌ర్ధుల విష‌యంలో మాత్రం కాస్త వెనుక‌డుగు వేసింద‌ని నిఘా వ‌ర్గాలు తెలిపాయి. కేంద్ర‌స్థాయి ఇంటెలిజెన్స్ విభాగంగా తెలిపిన లెక్క‌ల ప్ర‌కారం వైసీపీ 16 నుంచి 19 ఎంపీ సీట్ల‌ను గెలుపొందుతుంద‌ని, టీడీపీ ఐదు నుంచి ఆరు ఎంపీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని నిఘా వ‌ర్గాలు ఫ‌లితాల‌ను వెల్ల‌డించాయి.

న‌ర్సారావుపేట‌, విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు, మ‌చిలీప్ట‌నం, న‌ర‌సాపూర్‌, కాకినాడ ఎంపీ సీట్ల‌ను వైసీపీ కోల్పోతుంద‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం, విజ‌య‌వాడ‌ల‌లో కూడా వైసీపీకి టీడీపీ ట‌ఫ్ ఫైట్ ఇస్తుంద‌ని నిఘా వ‌ర్గాల స‌మాచారం. ఏదేమైనా మే 19వ తేదీన ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డిన‌ప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం వెల్ల‌డించిన స‌మాచారం క‌రెక్టా..? కాదా..? అన్న ప్ర‌శ్న‌ల‌పై క్లారిటీ వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.