2019 ఎన్నికలలో మాధురి దీక్షిత్ పోటీ చేయనుందా…?

Thursday, December 6th, 2018, 08:01:50 PM IST

బీజేపీ ఎన్నో కొత్త ఎత్తులు వేస్తూ, కేంద్రం లో మల్లి తామే అధికారంలోకి రావాలని యోచిస్తుంది. ఇందుకోసమనే ప్రముఖుల్ని తమ అభ్యర్థులుగా ప్రకటిస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక, బీజేపీ వచ్చే ఏడాది జరగనున్న సాధరణ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో పూణె నియోజక వర్గం నుంచి ప్రముఖ బాలీవుడ్‌ నటి మాధురి దీక్షిత్‌ను బరిలోకి దించుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వారి జాబితాకూడా రెడీ అయ్యిందని సమాచారం. ఈ జాబితాలో పూణే నుండి మాధురి దీక్షిత్ కి టికెట్ ఇచ్చారు. జూన్‌లో అమిత్‌షా ముంబయిలోని మాధురి ఇంటికి వెళ్లి ఇదే విషయం కోసమే చర్చించారని సమాచారం.

‘సంపర్క్‌ సమర్థాన్‌’(భాజపాకు మద్దతివ్వండి) కార్యక్రమంలో భాగంగా అమిత్‌ షా ఆమెతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి, సాధించిన అభివృద్ధి గురించి అమిత్‌ షా మాధురికి వివరించారు. ‘మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యూహాలనే పాటించారు. అప్పుడు కూడా పాత వారికి బదులు కొత్త వారికి అవకాశం ఇచ్చి, ప్రతిపక్షాలకు సైతం షాక్ ఇచ్చి విజయం సాధించిన విషయం వెల్లడించారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. కేంద్రం లో కూడా మల్లి తామే అధికారం లోకి వస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు అమిత్ షా.