విజయ్ దేవరకొండ “నోటా” బ్రేకీవెన్ అవ్వుద్దా..?

Saturday, October 6th, 2018, 07:11:49 PM IST

రౌడీ హీరో హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా,మెహ్రీన్ కథానాయికగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన చిత్రం “నోటా”.గీత గోవిందం వంటి భారీ హిట్ తర్వాత చిత్రం కావడంతో అందులోనూ రాజకీయ నేపధ్య చిత్రం కావడంతోను ఈ చిత్రం మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.కాని నిన్న విడుదలైన ఈ చిత్రం కనీసం విజయ్ అభిమానులకు కూడా నచ్చలేదు. ఇప్పుడు ఈ చిత్రం లాభాలను అందిస్తుందా నష్టాలను అందిస్తుందా అన్నది ప్రశ్న.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆరంభ ఆట తోనే ప్లాప్ టాక్ సంతరించుకుంది ఐనా ఆ ప్రభావం మొదటి రోజు మీద అసలు పడలేదు.దాదాపు 13 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తోనే 6 కోట్లు రాబట్టేసింది అంతే కాకుండా తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకే సారి విడుదల కాగా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 7 కోట్లు కొల్లగొట్టినట్టు సమాచారం.ఈ చిత్రాన్ని మొత్తంగా సొంతంగానే విడుదల చేసుకోవడం వల్ల వీరికి పెద్దగా నష్టం వచ్చే సూచనలు ఏమి కనిపించడం లేదు.దానికి తోడు ఈ చిత్రానికి గాను విజయ్ 1.25 కోట్ల రెమ్యూనరేషన్ కు బదులుగా లాభాల్లో వాటాను తీస్కుంటున్నట్టుగా తెలిపారు.

సినిమా సొంతంగా విడుదల,విజయ్ స్వాగ్ తో శాటిలైట్ మరియు మొదటి రోజు వసూళ్లతోనే దాదాపు అంతా రాబట్టేసారు.ఈ మధ్యలో కూడా ఎలాంటి చిత్రాలు లేకపోవడంతో నోటా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.సినిమాకి వచ్చిన టాక్,చుట్టుముట్టిన వివాదాలు ఇప్పుడు తేలిపోయేలా ఉన్నాయి.