పవన్ హోదా కోసం దీక్ష చేస్తారా?

Friday, April 13th, 2018, 03:48:52 AM IST


ప్రత్యేకహోదా సాధించడం కోసం తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ పవన్ కల్యాణ్ ప్రకటించడంతో అది త్వరలో కార్యరూపం దాల్చవచ్చునని ఆమధ్య ఊహాగానాలు సాగాయి. అయితే ఇప్పటివరకు దానిపై పవన్ ఎటువంటి కార్యాచరణ ప్రకటించలేదు. అయితే నేడు కొన్నిగంటాలపాటు వామపక్ష నేతలతో జరిగిన భేటీ తర్వాత, మీడియాకు వివరాలు వెల్లడించిన పవన్ కల్యాణ్ ఆమరణ నిరాహార దీక్ష అనే పాయింటు మాత్రం మాట్లాడకపోవడం గమనార్హం. హోదా సాధించడం కోసం ఇప్పటికే వివిధ పార్టీల వివిధ స్థాయిల్లో ఆమరణ నిరాహార దీక్షలు చేశాయి. ఈ విషయంలో వైసిపి కు కొన్ని ఎక్కువ మార్కులు పడతాయి. టీడీపీ నేతలు ప్లకార్డులు పట్టుకుని నిరాహార దీక్షలకు దిగారు. ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు. అలానే వామపక్షాలు, కాంగ్రెస్ కూడా దీక్షలు చేశాయి. ఈ విషయంలో నిర్దిష్టంగా అలాంటి దీక్షలు చేయకుండా ఉన్నది జనసేన మాత్రమే.

అదే పవన్ కల్యాణ్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటేగనుక, యూత్ లో ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా పవన్ దీక్ష ప్రకంపనలు సృష్టించగలరని అభిమానులు ఆశించారు. పవన్ కల్యాణ్ కూడా తాను జనాన్ని ఇబ్బంది పెట్టే ధర్నాలు, బంద్ లు చేయనని, తానే ఆమరణ దీక్షకు కూర్చుని సాధిస్తాను తప్ప మరో మార్గం తొక్కనని ఇదివరకు జనసేన బహిరంగసభలో చెప్పారు. అయితే పవన్ హోదాకోసం దీక్ష చేస్తే, తాము మద్దతు ఇస్తాం అని జనసేన-వామపక్ష కూటమి కార్యకర్తలంతా అందులో పాల్గొంటారని ప్రకటించారు. కానీ ఆయన దీక్ష ప్రకటన ఉంటుందని ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశ తప్పలేదు. కాగా పవన్ హోదా విషయమై దీక్ష దిశగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పలువురు నేతలు, అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments