రాజమౌళి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా..?

Saturday, March 16th, 2019, 12:34:35 PM IST

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో డీవీవీ దానయ్య “ఆర్ఆర్ఆర్” సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా 1920 కాలం నాటి స్వాతంత్ర్య ఉద్యమం నేపథ్యంలో సాగే కథతో ఉండబోతోందని, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల ఫిక్షనల్ స్టోరీ అని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి వెల్లడించారు. ఈ సినిమాను హిందీతో సహా పలు భాషల్లో విడుదల చేయనున్నట్టు దానయ్య తెలిపారు, ఇక్కడే బాహుబలి ఫార్ములా ఈ సినిమాకు వర్కౌట్ అవుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

ఎందుకంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ఇద్దరికీ తెలుగులో తప్ప ఇతర భాషల్లో మార్కెట్ లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమాను కేవలం 1920ల నాటి కథ, స్వాతంత్ర్య పోరాట యోధుల కథ, పాన్ ఇండియా స్టోరీ అన్న పాయింట్ మీదే మార్కెట్ చేసుకోవాలి. బాహుబలి సినిమా పూర్తిగా కల్పిత కథ కావటం, దీనికిఎం కరణ్ జోహార్ తోడవటం బాగా ప్లస్ అయ్యింది. పైగా ఈ ట్రిపుల్ ఆర్ కథ చరిత్రకు సంబంధించి కాబట్టి ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకునే అవకాశం కూడా లేదు. మరి, రాజమౌళి స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.