రవిప్రకాష్ అరెస్టు తప్పదా…?

Friday, June 7th, 2019, 01:27:39 AM IST

గతకొంత కాలంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ వరుసగా మూడవరోజు కూడా విచారణకు హాజరయ్యారు… కాగా కొత్త యాజమాన్యం అలందా మీడియా గ్రూప్‌ ఫిర్యాదు నేపథ్యంలో సిసిఎస్‌ పోలీసులు రవిప్రకాశ్‌ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఫోర్జరీ, నిధుల మళ్లింపు తదితర అంశాలపై సిసిఎస్‌ పోలీసులు రవిప్రకాశ్‌ నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ విచారణలో రవిప్రకాష్ వద్ద నుండి అంతగా ఆశించిన సమాధానం రావట్లేదని సమాచారం… ఇదిలా ఉండగా రవి ప్రకాశ్‌ను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. విచారణలో ఆయన పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది.

అయితే రవిప్రకాష్ విచారణకు సరిగ్గా సహకరించకపోతే అరెస్టు చేయడం తప్పదని అధికారులు చెబుతున్నారు. గత రెండు రోజుల పాటు విచారించినా రవిప్రకాశ్‌ నుంచి పోలీసులు ఎలాంటి కీలకమైన సమాచారాన్ని రాబట్టలేదని సమాచారం. మొదటి రోజు ఐదు గంటలు, రెండో రోజు 11 గంటల పాటు విచారించినా ఫలితం లేకుండాపోయిందని, రవిప్రకాష్ అన్ని పొంతన లేని సమాదానాలు చెబుతున్నారని, అన్ని మాటలు మార్చుతూ మాట్లాడుతున్నాడని అధికారులు అంటున్నారు…