జగన్ కు సింపతీ వర్కౌట్ అవుతుందా ?

Monday, October 29th, 2018, 11:18:45 AM IST

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అందరూ చర్చించుకుంటున్న విషయం జగన్ పై జరిగిన దాడి గురించే, దాడి జరిగిన దగ్గర్నుండి వైసీపీ, టీడీపీ పరస్పరం విమర్శించుకుంటున్న సంగతి తెలిసిందే టీడీపీ మరో అడుగు ముందుకేసి ఈ దాడి వెనక కేంద్రం కుట్ర ఉందంటూ ఆరోపించింది. ఈ నేపథ్యం లో ఈ ఘటన పై పోలీస్ రిమాండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఘటన యొక్క సీరియస్నెస్ ఇంకా పెరిగింది, అప్పటి వరకు పెద్దగా స్పందించని చంద్రబాబు ప్రభుత్వం కూడా స్పందించింది. చంద్రబాబు డీజీపీ తో సమావేశమై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలిచ్చారు.

ఇదిలా ఉంటే జగన్ మాత్రం దాడి జరిగిన తర్వాత పార్టీ శ్రేణులు సమన్వయం తో వ్యవహరించండి అంటూ ట్వీట్ చేయటం మినహాయించి ఎక్కడా ఈ దాడి గురించి ప్రత్యక్షంగా స్పందించలేదు, ప్రస్తుతం విజయనగరం పాదయాత్ర లో ఉన్న ఆయనకు ఒక వారం రోజుల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించారు. దీంతో నవంబర్ 3 వరకు అయన పాదయాత్ర లో పాల్గొనే అవకాశం లేదన్నమాట, కాబట్టి ఈ ఘటన పై జగన్ పాదయాత్ర లోనే స్పందిస్తారన్నమాట.

అయితే జగన్ ఈ ఘటన పై ఎలా స్పందిస్తారు, సానుభూతి కోసం ప్రయత్నిస్తారా, ఈ ఘటన ని ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఇక ఇప్పటికే జగన్ పాదయాత్ర కు అశేష జనాదరణ లభిస్తోంది, విశ్రాంతి తర్వాత పాల్గొనబోయే యాత్రకు కూడా అంతే ఆదరణ వచ్చే వీలుంది. కాగా, ఈ ఘటన ని వైసీపీ ఎలా తమకి అనుకూలంగా మలుచుకుంటుందో చూడాలి. జగన్ విషయానికొస్తే ఈ ఘటన ని సానుభూతి కోసం వాడుకోవాలన్న ఆలోచన చేసే రకం కాదు కానీ, ఈ ఘటన పై ప్రభుత్వం వ్యవహరించిన తీరును, చంద్రబాబు ను ప్రతి సభ లోనూ ఎండగట్టే ప్రయత్నం చేయటం ఖాయం. మొత్తంమీద ఈ దాడి ఘటన జగన్ పై సానుభూతి పెంచుతుందని చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments