షాకింగ్ న్యూస్ : చివరికి ఆ మహిళ కొండ చిలువ కడుపులో..

Saturday, June 16th, 2018, 06:56:47 PM IST

కూరగాయలకోసమని తోటకు వెళ్లిన మహిళ మళ్లీ వెనక్కి రాలేదు. ఏం జరిగిందో అని గ్రామస్థులు ఆమె కోసం ఊరంతా గాలించారు. ఎక్కడా దొరకలేదు. చివరికి ఊహించని పరిస్థితుల్లో ఆమె మృతదేహాన్ని చూసే సరికి అందరూ షాక్ అయ్యారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలో 51 ఏళ్ల మహిళ తన గ్రామంలో ఉన్న కూరగాయల తోటకు వెళ్లి కూరగాయలు కోసుకొస్తానని చెప్పి వెళ్లింది. అరగంటలో వస్తాను అని చెప్పిన టిబా గంటలు గడుస్తున్నా ఇంటికి రాకపోవడంతో వెతుకులాట ప్రారంభించారు.

కొందరు గ్రామస్థులు కూడా వారితో కలిసి టిబా కోసం గాలించారు. చివరికి లాభం లేదని పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే మరుసటి రోజు తోటలో ఒక కొండ చిలువ ఉందని తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి వెళ్లారు. చాలా పెద్ద పరిమాణంలో ఉన్న ఆ కొండ చిలువను చూసి అందరూ భయపడ్డారు. అయితే అది కదల్లేని పరిస్థితిలో ఉందని గమనించి ముందు చంపేశారు. ఆ తరువాత కడుపు కోయడంతో కనిపించకుండా పోయిన టిబా పాము కడుపులో కనిపించింది. ఈ ఘటనను చూసి పరిసర గ్రామ ప్రజలు కూడా షాక్ అయ్యారు.