యాక్క్… ఐస్ క్రీంలో ఎలుక

Tuesday, May 1st, 2018, 10:44:27 PM IST

హాట్ హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ ఐస్‌క్రీంలను తినాలని ఆలోచిస్తున్నారా..? అయితే మేం ఇప్పుడు చెప్పబోయేది తెలుసుకుంటే.. ఇక ఐస్‌క్రీం తినాలంటే ఒకసారి జి=మీ గుండె హడేలెత్తాల్సిందే. ఎందుకంటారా.. చైనాలోని షాంఘైలో ఓ మహిళ ఎంతో ఇష్టంగా ఐస్‌క్రీం కొనుక్కుని తింటే.. అందులో ఎలుక వచ్చింది. ఆ మహిళ ఐస్‌క్రీంను సగం తిన్నాక దాంట్లో ఎలుక తోక ముందుగా ఆమెకు కనిపించింది. దీంతో మొదట ఆమె ఆ తోకను చూసి గొంగళి పురుగనుకుంది. దాన్ని మెల్లగా బయటకి లాగేసరికి అది ఎలుకని తెలిసింది.

ఐస్‌క్రీం గడ్డకట్టుకుపోయినందున అందులో చిక్కుకున్న ఎలుక కూడా అలాగే గడ్డకట్టింది. ఈ క్రమంలో ఆ మహిళ తాను ఐస్‌క్రీం కొనుగోలు చేసిన షాపుకు వెళ్లి తనకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. షాపు అతను ఆమెకు 12 ఐస్‌క్రీంలను ఉచితంగా ఇస్తానని చెప్పాడు. అయినా ఆమె వినలేదు. 800 యువాన్లు (రూ.8400) ఇస్తానన్నాడు. అందుకూ ఆమె ససేమిరా అంది. మళ్లీ 2వేల యువాన్లు (రూ.21వేలు) ఇస్తానన్నా ఆమె 50వేల యువాన్లు (రూ.5.20 లక్షలు) డిమాండ్ చేసింది. అయితే సాధారణంగా ఇలాంటి ఘటనల్లో చైనాలో బాధితులు 1వేయి యువాన్ల (రూ.10,500) వరకే నష్టపరిహారం డిమాండ్ చేయవచ్చట. అందుకని ఇక ఆమె చేసేది లేక అంత మొత్తం నష్టపరిహారం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా ఆ మహిళ తన ఐస్‌క్రీంలో కనబడిన ఎలుక ఫొటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ విషయం కాస్తా వైరల్ అవుతున్నది. కాకపొతే చైనీయులకు ఎలుకలు కప్పలు తినడం అలవాటే కాబట్టి అక్కడి ప్రజలు అంతగా ఆందోళన చెందే అవసరం లేదని అన్నారు. అది చైనీయులకు చిన్న విషయమేమో కానీ అదే మన దేశంలో అయితే అమ్మిన వాడి జీవితం నాశనం అయ్యేవరకు ఊరుకోరు కదా.

  •  
  •  
  •  
  •  

Comments