జనధన్ ఖాతాలో 100 కోట్లు.. ప్రధానికి ఈ-మెయిల్

Tuesday, December 27th, 2016, 09:39:19 AM IST

money2000-new
ఉత్తరప్రదేశ్ కు చెందిన శీతల్ యాదవ్ అనే మహిళకు మీరట్ లో గల భారతీయ స్టేట్ బ్యాంకు బ్రాంచ్ లో అకౌంట్ ఉంది. ఈ నెల 18వ తేదీన శీతల్ డబ్బు డ్రా చేసుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంకు వెళ్ళింది. ఏటీఎంకు వెళ్లిన శీతల్ కు బ్యాలన్స్ అమౌంట్ చూసి దిమ్మ తిరిగినంత పనయ్యింది. 99,99,99,394 రూపాయలు తన అకౌంట్లో ఉండడం చూసి షాక్ అయ్యింది. ఈ విషయాన్ని నమ్మలేకపోయిన శీతల్ ఎటిఎం వద్ద మరొకరికి చూపించి తన అకౌంట్లో అంత డబ్బు ఉండడం నిజమేనని నిర్ధారించుకుంది.

అక్కడినుండి ఆమె తనకు అకౌంట్ ఉన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బ్రాంచ్ కు వెళ్లి మరొకసారి బాలన్స్ చెక్ చేసింది. మరల తన ఖాతాలో 100 కోట్లు ఉన్నట్టు తెలుసుకుని విషయాన్నీ తన భర్త జైలేదార్ సింగ్ కు చెప్పింది. అతను తన భార్యను వెంటపెట్టుకుని బ్యాంకు కి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. అయితే బ్యాంకు సిబ్బంది మేనేజర్ అందుబాటులో లేరని, తరువాత రావాలని వాళ్ళను పంపేశారు. మరుసటి రోజు వాళ్ళు వచ్చినప్పటికీ సిబ్బంది వేరే కారణాలు చెప్పి మళ్ళీ పంపేశారు. దీంతో అనుమానం వచ్చిన సింగ్ తన సన్నిహితుల సలహా మేరకు తన అకౌంట్ కు సంబందించిన వివరాలను ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ-మెయిల్ పంపినట్లు చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments