నాలుగవ అంతస్థులో వ్రేలాడుతూ కనిపించిన కారు!

Thursday, June 14th, 2018, 12:21:07 AM IST

కారు పార్కింగ్ చేయడానికి వెళ్లిన ఒక వృద్ధురాలు కళ్లు మూసి తెరిచే లోపు అక్కడున్న వారికి నాలుగో అంతస్తులో కారులో వ్రేలాడుతూ కనిపించింది. అందరూ షాక్ అయ్యి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఘటనకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన అమెరికాలోనే కాలిఫోర్నియాలో ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఆ అసలు వివరాల్లోకి వెళితే.. 50 ఏళ్లకు పై బడిన ఒక వృద్ధురాలు ఇటీవల ప్రాన్స్ దేశం నుంచి అమెరికా పర్యటనకు వచ్చింది. అయితే కాలిఫోర్నియా లోని ఒక ప్రాంతంలో కార్ పార్కింగ్ చెయ్యాలని పార్కింగ్ బిల్డింగ్ పైకి పొనిచ్చింది. సరిగ్గా నాలుగవ అంతస్తు రాగానే బ్రేక్ వేయబోయి యాక్సిలరేటర్‌ తొక్కడంతో ఎటు కాకుండా మధ్యలో వ్రేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సిబ్బందిని పిలిపించి క్రేన్ సహాయంతో కారును అలాగే వృద్ధురాలిని రక్షించారు.

  •  
  •  
  •  
  •  

Comments