జనసేనాని ముంగిట భావోద్వేగానికి గురైన మహిళ..!

Wednesday, September 26th, 2018, 10:51:02 AM IST


చాలా కాలం తర్వాత మళ్ళీ జనసేనాని ప్రజల మధ్యలోకి వచ్చారు.తన ప్రజా పోరాట యాత్రలో భాగంగా తాను వెళ్లే ప్రతీ నియోజకవర్గానికి సంబందించి అక్కడ అణచివేతకు గురి చేయబడుతున్న ప్రతి ఒక్కరితోను పవన్ ఒక చిన్నపాటి సభలను పెట్టి వారి యొక్క సమస్యలను తెలుసుకుంటారు.అదే విధంగా జనసేనాని తన యాత్రలో నిమిత్తం ఏలూరుకు చేరుకున్నారు.అక్కడి ప్రాంత ఆటో డ్రైవర్లతోను,దివ్యంగులుతోను మరియు అక్కడి రెల్లి సంక్షేమ వర్గం వారితోను వేరే వేరేగా సభలు నిర్వహించారు.

అక్కడి రెల్లి సంక్షేమ వర్గం వారు పవన్ కళ్యాణ్ గారితో వారి యొక్క బాధలని,వారు పడుతున్న అవమానాలని వెలగక్కుకున్నారు,వారిలో ఒక యువకుడు మాట్లాడుతూ వారితో ఎవరైనా రాజకీయ నాయకులు చాలా హీనంగా చూస్తూ,అంటరానివారిలాగా మాట్లాడుతారని,అలాంటిది పవన్ కళ్యాణ్ తన మీద చెయ్యి వేసి మాట్లాడుతున్నారని చాలా భావోద్వేగానికి గురయ్యాడు.అంతే కాకుండా వారిలో ఒక మహిళా మూర్తి మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళది రెల్లి కులం అని చెప్పి అందరు చాలా హీనంగా చూస్తున్నారని,రెల్లి వారు అంటే ఎవరు గుర్తించటం లేదని పాకి వారిలా ఒక ముద్ర వేసేశారని తెలియజేసారు.

అసలు వారిని పట్టించుకునే రాజకీయ నాయకులే లేరని కనీసం తాగు నీరు పంపు కూడా వారికి లేదని,ఉండటానికి సరైన వసతులు కూడా లేవని వాపోయారు,ఈ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఎన్ని సార్లు అడిగినా సరే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వెళ్లిపోతున్నారని,మేము వారికి ఓట్లు వేయించుకునే ముందు తప్ప అసలు గుర్తుండటం లేదని తెలిపారు,అలాంటిది మా యొక్క కష్టాలను తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిలా ఏ నాయకుడు ముందుకు రాలేదని ఆయన తమ పాలిట దేవునిలా వచ్చారని ఆ మహిళా మూర్తి భావోద్వేగానికి గురయ్యారు.