దివ్యాంగురాలిపై జాలిలేకుండా సామూహిక అత్యాచారం..

Monday, April 16th, 2018, 12:34:19 PM IST

ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలపై అత్యాచారాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అందరికి తెలిసిందే. ఇటీవల కథువ ఘటన ప్రతి ఒక్క భారతీయుడిని కలచివేసింది. దేశమంతా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయినా కూడా అలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోంది. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఓ దివ్యాంగురాలిపై అసహ్యంగా ప్రవర్తించిన ఘటన అందరిని షాక్ కి గురి చేసింది. అయితే ఓ వ్యక్తి వల్ల దివ్యాంగురులు క్షేమంగా బయటపడింది.

అసలు వివరాల్లోకి వెళితే.. విజయనగరంజిల్లా నెల్లిమర్ల ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పూసపాటిరేగకు చెందిన ఓ యువ దివ్యాంగురాలు పూల్‌బాగ్‌ ప్రాంతంలో ఉంటున్న తన సోదరి దగ్గరికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. అయితే గమ్యానికి చేరుకున్న తరువాత ఆటో ఆపాల్సిందిగా ఆ యువతీ కోరింది. కానీ ఆటో డ్రైవర్ ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఆమెను అరవకుండా నోరు గట్టిగా నొక్కేసి. ఆటోను ఒక నిర్మానుషమైన పొదల్లోకి తీసుకెళ్లారు. అయితే అటుగా వెళుతోన్న ఓ వ్యక్తికి అనుమానం వచ్చి ఆటో దగ్గరికి వెళ్లగా యువతిని అక్కడే వదిలేసి దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన దివ్యాంగురాలిని ఆస్పత్రిలో చేర్పింది. కేసు నమోదు చేసుకున్నారు. ఎలాగైనా నిందితులను పట్టుకుంటామని వారు సమాధానం ఇచ్చారు.